ఏప్రిల్ 2న Dhoni finishes it off in style.. భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైన రోజు. 28 ఏళ్ల (1983) తర్వాత టీమిండియా రెండో వన్డే ప్రపంచ కప్ సాధించినరోజు. యావత్ భారతావని ఆనందడోలికల్లో మునిగితేలింది. 2007 ప్రపంచ కప్ దారుణ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని 2011లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన జట్టు విశ్వకప్‌ను కైవసం చేసుకుని భారతీయుల ఆకాంక్షను నెరవేర్చిన క్షణం. భారత్ రెండో ప్రపంచ కప్ గెలిచి నేటికి సరిగ్గా 9 ఏళ్లు అవుతోంది. సచిన్ సుదీర్ఘమైన కెరీర్‌లో అందుకున్న అద్బుత విజయం వన్డే వరల్డ్ కప్.
రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలకు అందని ద్రాక్షగా మిగిలిన వన్డే వరల్డ్ కప్‌ను సాధించిన జట్టులో సభ్యుడిగా నిలవగానే సచిన్ ఉద్వేగానికి లోనయ్యాడు. 6వ ప్రయత్నంలో తన కల నెరవేర్చిన జట్టు సభ్యులకు సైతం సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ధన్యవాదాలు తెలిపాడు. యువరాజ్ సింగ్‌తో కలిసి ఉద్వేగభరితమైన క్షణాలను పంచుకున్నాడు. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు జయవర్ధనే అజేయ శతకం (88 బంతుల్లో 103 నాటౌట్; 13 ఫోర్లు)తో రాణించడంతో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, యువరాజ్ చెరో 2 వికెట్లు సాధించారు. భజ్జీకి 1 వికెట్ దక్కింది. ఛేజింగ్‌లో భారత్ తడబడింది. ఇన్సింగ్స్ రెండో బంతికి వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్. లంక బౌలర్ లసిత్ మలింగ వైవిధ్య బంతులకు భారత్ 31 పరుగులకే సచిన్ (18), వీరేంద్ర సెహ్వాగ్‌ల వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ప్రపంచ కప్ కల మరోసారి కలగానే మిగిపోతుందా అనే అనుమానం కలిగింది. కానీ గౌతమ్ గంభీర్ పట్టుదల, ఓపిక.. క్రీజులో కుదురుకుని జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గంభీర్ వెనుదిరిగాడు. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
అప్పటికీ భారత్ లక్ష్యం 52 బంతుల్లో 52. ధోనీతో కలిసి శతక భాగస్వామ్యం (109 పరుగులు) అందించిన తర్వాత గంభీర్ వికెట్ సమర్పించుకున్నాడు. క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (24 బంతుల్లో 21 నాటౌట్) తో కలిసి ధోనీ (79 బంతుల్లో 91 నాటౌట్; 8 ఫోర్లు 2 సిక్సర్లు) జట్టుకు విజయతీరాలకు చేర్చాడు. 2007 ట్వంటీ20 ప్రపంచ కప్ హీరోలు గంభీర్, యువరాజ్ సింగ్‌లు ఈ వన్డే వరల్డ్ కప్‌లో కీలక సమయాల్లో రాణించి కోట్లాది భారతీయుల కలల్ని మరోసారి సాకారం చేశారు. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ
తక్కువ బంతుల్లో పరుగులు సాధించిన ఎంఎస్ ధోనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన హీరో యువీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కైవసం చేసుకున్నాడు. క్యాన్సర్ బాధితుడిగా ఉన్నా యువీ మాత్రం పట్టుదలతో ఆడాడు. చనిపోయినా చనిపోతానేమో కానీ మధ్యలో మాత్రం వైదొలగనని స్పష్టం చేసిన ధీరుడు యువీ. భారత్ రెండో సారి వన్డే ప్రపంచ కప్ గెలిచి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నా ఆ క్షణాలు ఇప్పటికీ భారతీయుల మదిలో మెదుతూనే ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ