Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 15 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Today Horoscope In Telugu 15 June 2021: కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతారు. మీరు నగదు ద్వారా కొన్ని పొందుతారు. పనిచేసే చోట కొత్తగా ఉపయోగకరమైన విషయాలను నేర్చుకోవడం ద్వారా మీ సామర్థ్యం బలపడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 15, 2021, 08:23 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 15 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today 15 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేషం, వృషభం నుంచి మీన రాశివరకు ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 15వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
బ్యాంకుకు సంబంధించిన పనులు చికాకు తెప్పిస్తాయి. నేడు మీకు ఆర్థిక సమస్యలు గోచరిస్తున్నాయి. ఆస్తి కోసం ఎలాంటి పోటీ పడకుండా ఉండటానికి ప్రయత్నించండి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

వృషభ రాశి
కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతారు. మీరు నగదు ద్వారా కొన్ని పొందుతారు. పనిచేసే చోట కొత్తగా ఉపయోగకరమైన విషయాలను నేర్చుకోవడం ద్వారా మీ సామర్థ్యం బలపడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. 

Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?

మిథున రాశి
మీరు చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతాయి. డ్రైవ్ కోసం వెళ్లడం బహుశా మీ మనస్తత్వాన్ని ఉత్తేజపరుస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ దగ్గర పనిచేసే వారి గురించి మీ అనుమానాలు నిజం కాదని తెలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు పనిభారం అధికం కానుంది.

కర్కాటక రాశి 
మీ కొత్త ఆలోచనతో డబ్బు సంపాదిస్తారు. మీకు ఇబ్బంది కలిగించే బాధలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ద్వారా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఇష్టపడే ఒకరికి మీ మనసులో మాటను చెబుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

సింహ రాశి
మీరు తీవ్రంగా శ్రమించినా అందుకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్యానికి సంబంధించిన పనులు చేపట్టడానికి ఇది తగిన సమయం కాదు. ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కెరీర్‌లో కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలు వస్తాయి.

కన్య రాశి
పరిమిత అవకాశం ఉన్నచోట అధికంగా శ్రమించినా ఫలితం రావడం కష్టమవుతోంది. మీరు కోరుకునే ప్రాంతానికి ప్రయాణించడానికి అవసరమైన విశ్రాంతి తీసుకుంటారు. మీరు వ్యాపార రంగంలో పోటీని అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నించడానికి సిద్ధమవుతారు. ఉద్యోగులకు పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. 

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

తులా రాశి
నేడు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలలో కలిసొస్తుంది. మీ సహచరుడి చేసిన సిఫార్సు ద్వారా మీకు పండితుల సహకారం లభిస్తుంది. వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో నిమగ్నమవుతారు. కొందరు విశ్వసించలేని వ్యక్తులు మిమ్మల్ని చుట్టుముడతారు. కుటుంబ పరిస్థితి మీకు కష్టసాధ్యంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.

వృశ్చిక రాశి 
మీ ఆలోచనలు చేసే పనులతో కుటుంబసభ్యులు ఏకీభవించరు. ఆస్తి విషయంలోనూ మోసపోయే అవకాశాలున్నాయి. ఏ పని చేసినా నిజాయితీగా వ్యవహరిస్తారు. చిల్లర వ్యాపారులు వ్యాపార రంగంలో కఠినమైన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు శ్రమించినా ఫలితం దక్కదు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు ప్రారంభిస్తారు.

ధనుస్సు రాశి
ఆస్తి ఎంపిక గొప్ప ఫలితాలను అందిస్తుంది. ఒకరిని ఒప్పించడం కష్టమని మీరు అనుకున్న సందర్భంలో మీకు ఎలాంటి సాయం అందదు. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ ధ్యానం చేయాలి. గొప్ప శ్రేయస్సును తిరిగి పొందడంలో ఇది మీకు దోహదం చేస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 

మకర రాశి
అవసరం అయితే మాత్రమే ప్రయాణం చేయండి. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం తినాలి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మీకు ఆర్థిక ప్రయోజనాలను అందించనున్నాయి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీతో సంబంధం ఉన్న ఎవరైనా నిపుణుల ముందు సహాయం చేస్తారు. ఎరుపు ఈరోజు మీకు కలిసొచ్చే రంగు.

Also Read: Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?

కుంభ రాశి
విహారయాత్రలకు వెళ్లాలని భావిస్తారు. కుటుంబం కోసం అదనపు బాధ్యతలు తీసుకుంటారు. డిమాండ్ రావడంతో కుటుంబ ఆస్తి అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. మీరు చేసే ఓ ప్రయత్నం అందరి నుంచి ప్రశంసలు పొందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

మీన రాశి
అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. అధికంగా శ్రమించినా ఫలితం కనిపించదు. మీ అహంకారం నాశనం చేయడానికి కొందరు ప్రయత్నాలు మొదలుపెడతారు. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మీరు చేపట్టిన పనులు త్వరలోనే పూర్తవుతాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News