Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 13 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి నూతన గృహయోగం

Today Horoscope In Telugu 13 June 2021: దీర్ఘకాలిక వ్యక్తిగత లక్ష్యాలపై ఆలోచనలు మొదలవుతాయి. స్తిరాస్తులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగులకు ఓ కీలక సమాచారం అందుతుంది. స్థిర నివాసంపై ఫోకస్ చేస్తారు. గతంలో చేసిన పెట్టుబడులకు వ్యాపారులకు లాభాలు అందుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2021, 08:27 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 13 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారికి నూతన గృహయోగం

Today Horoscope In Telugu 13 June 2021: మేష రాశి
ఈ రోజు మీకు అనుకూలం. మీరు ఎదుర్కొంటున్న ఏదైనా వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. మీ కుటుంబం ఈ రోజు మీ అభిప్రాయాలను వినకపోవచ్చు. శ్రమకు తగిన ఫలితం కోసం ఎదురుచూస్తారు. మీ పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 

వృషభ రాశి
ఈ రోజు మీపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. మీరు పనిలో మీ సృజనాత్మకతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ఉన్నతాధికారులతో కొత్త విషయాలపై ఆలోచిస్తారు. ఆర్థిక పరిస్థితి నేడు మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులకు ఇది తగిన సమయం. ఉద్యోగులకు త్వరలో నూతన ఉద్యోగావకాశాలు. 

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే 

మిథున రాశి
మిథునరాశి వారికి రోజు ప్రారంభంలో కొన్ని మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆలోచనలు పదే పదే మారడంతో ఖర్చులు అధికం కానున్నాయి. మరోవైపు కెరీర్ కొత్త దిశగా వెళుతుంది. మీ ఆర్థిక పరిస్థితులు తనిఖీ చేసుకుంటారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.

కర్కాటక రాశి 
నేడు ప్రయాణాలు చేయాలని భావిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇల్లు లేదా వాహనాలు లాంటి విలువైనవి కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. 

సింహ రాశి
ఈ రోజు సింహ రాశి సంతోషంగా ఉంటారు. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా చూస్తారు. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. తమ అధ్యయనాలపై అదనపు దృష్టి సారించాలని భావిస్తారు. మీ జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటారు.

కన్య రాశి
కొందరు మీ సహనాన్ని పరీక్షించాలని చూస్తారు. సృజనాత్మకతకు సంబంధించిన వాటి కోసం నగదు ఖర్చు చేసే అవకాశం ఉంది.  హస్తకళల్లో నైపుణ్యం ఉన్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ లక్ష్యంపై దృష్టిసారించాలని భావిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

Also Read: Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?

తులా రాశి
ఈ రాశివారికి రాత్రి తగినంత నిద్ర రాలేదు. దీర్ఘకాలిక వ్యక్తిగత లక్ష్యాలపై ఆలోచనలు మొదలవుతాయి. స్తిరాస్తులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగులకు ఓ కీలక సమాచారం అందుతుంది. స్థిర నివాసంపై ఫోకస్ చేస్తారు. గతంలో చేసిన పెట్టుబడులకు వ్యాపారులకు లాభాలు అందుతాయి.

వృశ్చిక రాశి 
సృజనాత్మకతకు సంబంధించిన విషయాలు ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. కొత్తగా వివాహం అయిన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తారు. అనుకోకుండా వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
విద్యార్థులు తమ తెలివి, నైపుణ్యానికి తగ్గట్లుగా కెరీర్‌ను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి కొందరిని కలుసుకుని సరదాగా గడుపుతారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది.

మకర రాశి
నేడు మీరు కొంత సమయం ఒంటరిగా గడపాలని భావిస్తారు. మీ జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి కావాలని ఆశగా ఎదరుచూస్తారు. కొన్ని విషయాలలో మీకు కలిసిరానుంది. చాలా కాలం తరువాత నగదు చేతికి అందుతుంది. వ్యాపారులకు చిక్కులు తొలగిపోతాయి.

Also Read: Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?

కుంభ రాశి
నేడు ఉదయం చాలా సోమరితనంగా అనిపిస్తుంది. ఏ పనులు చేయాలనిపించదు. కానీ పనికి డిమాండ్ రావడంతో సకాలంలో స్పందిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. కొన్ని సనులు సకాలంలో పూర్తవుతాయి.

మీన రాశి
మీ అదృష్టం త్వరలో మారబోతోంది. ఈరోజు మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని భావిస్తారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆఫీసు పనుల భారం మీపై పడుతుంది. కొన్ని పనులు నత్తకడకన సాగుతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News