Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలకు అధిపతిగా సూర్య గ్రహంగా చెప్పుకుంటారు. సూర్య గ్రహం ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశి సంచారం చేస్తూ ఉంటుంది. శాస్త్రం ప్రకారం సూర్య గ్రహాన్ని ఆత్మ, తండ్రి, ధైర్యంగా పరిగణిస్తారు. వ్యక్తుల జాతకంలో సూర్యగ్రహం అనుకూల స్థానంలో ఉంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, సంపదకు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే ఈ గ్రహం జాతకంలో ఆ శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. తీవ్ర ఇబ్బందులతో పాటు మానసిక అనారోగ్య సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
ఈ రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం:
కర్కాటక రాశి:
సూర్య గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ప్రతికూల స్థానంలో జరగబోతోంది దీనికి కారణంగా వీరికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో అనేక రకాల ఆటంకాలు వస్తాయి. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్లో కూడా అనేక రకాల సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి:
సింహ రాశి వారికి సూర్య గ్రహ సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నవంబర్ 17 వరకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో పనుల్లో జాప్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కోపం కారణంగా చర్చలు విఫలమవుతాయి. ఈ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.
కన్యారాశి:
కన్యా రాశి వారి జాతకంలో కూడా సూర్య గ్రహ సంచారం ఆ శుభ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వీరికి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదార కారణంగా ఆర్థిక పరిస్థితులకు కూడా మారబోతుంది. అంతే కాకుండా అవసరమైన ఖర్చులను మానుకుంటే చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.