Shani Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటేనే జీవితాంతం ఆనందంగా అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే ఆర్థిక నష్టాలతో పాటు జీవితం చిన్నాభిన్నమవుతుంది. అలాగే ఈ శని గ్రహం సంచారం చేయడం కారణంగా కూడా అప్పుడప్పుడు శుభ అశుభ ప్రభావాలు ఏర్పడతాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై సమానంగా పడుతుంది. ఇదిలా ఉంటే మే 12న శని దేవుడు పూర్వాభాద్రపద నక్షత్రంలోని రెండవ స్థానానికి సంచారం చేయబోతున్నాడు. ఆగస్టు 18 వరకు ఈ గ్రహం అదే స్థానంలో ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో శని శుభ స్థానంలో ఉన్నవారికి విపరీతమైన ధన లాభాలతో పాటు.. జీవితంలో ఎప్పుడు పొందలేని అదృష్టాన్ని పొందగలుగుతారు. అయితే ఈ నక్షత్ర సంచారంతో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్య రాశి:
శని గ్రహం నక్షత్ర సంచారంతో కన్యా రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు న్యాయపరమైన విషయాల్లో ఎన్నడూ సాధించలేని విజయాలు సాధిస్తారు. అలాగే వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. గతంలో ఆస్తుల్లో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో రెట్టింపు లాభాలను అందిస్తాయి. దీంతో పాటు కన్యా రాశి వారు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీంతో పాటు వీరు ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి:
శని నక్షత్ర గమనం కారణంగా వృశ్చిక రాశి వారికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో సులభంగా జరిగిపోతాయి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి. దీంతోపాటు వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతోపాటు వీరు శని గ్రహ ప్రభావంతో శుభవార్తలు వినగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో వస్తున్న కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం కాబోతున్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కుంభరాశి:
శని గ్రహ నక్షత్ర సంచారం ప్రభావం కుంభ రాశి వారిపై కూడా పడబోతోంది. దీనికి కారణంగా ఈ రాశి వారికి శని దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించి, వీరు ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా సమాజంలో మంచి గౌరవం, కీర్తి ,ప్రతిష్టలు పొందుతారు. ఇక డబ్బు పరంగా చూస్తే వీరికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వ్యాపారంలో వస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో వెంటనే పరిష్కారం అవుతాయి. దీంతోపాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే సమాజ సేవ చేసేవారు ఈ సమయంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందగలుగుతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి