May 2023 Grah Gochar: మే నెలలో గ్రహ సంచారాలు, ఈ రాశువారికి నెల మొత్తం లాభాలే, లాభాలు!

May 2023 Grah Gochar: మే నెలలో చాలా గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 27, 2023, 12:22 PM IST
May 2023 Grah Gochar: మే నెలలో గ్రహ సంచారాలు, ఈ రాశువారికి నెల మొత్తం లాభాలే, లాభాలు!

May 2023 Grah Gochar: మే నెల ప్రారంభంలో శుక్రుడు వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. అంతేకాకుండా ఇదే క్రమంలో శుక్రుడు, కుజుడు కూడా ఒకే రాశిలో కలుస్తారు. మే 10న కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేసే ఛాన్స్‌ కూడా ఉంది. ఈ రెండు గ్రహాలే కాకుండా మే నెలలో సూర్యుడు తన రాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి సంచారం చేయబోతోంది. అంతేకాకుండా కుజుడు కూడా మేష రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహ స్థానాల మధ్య మే నెలలో చాలా రాశులవారికి పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై సంచారాల ప్రభావం:
మిథున రాశి:

మిథున రాశి వారిపై గ్రహ సంచారాల ప్రభావం పడబోతోంది. ఈ క్రమంలో వృత్తి పరంగా విశేష ప్రయోజనాలను పొందనున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి.  పూర్వీకుల ఆస్తి విషయంలో కూడా మీరు లాభాలు పొందొచ్చు. ఈ క్రమంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. 

సింహరాశి:
ఈ గ్రహ సంచార ప్రభావం వల్ల సింహరాశి వారు విశేష విజయాన్ని పొందుతారు. వృత్తి సంబంధిత విషయాలలో అనే లాభాలు కలుగుతాయి. కొన్ని కొత్త ఉద్యోగ ఆఫర్లను కూడా పొందవచ్చు. వీరు వ్యాపారాల ప్రరంగా పెద్ద డీల్‌ను ఖరారు చేసుకోవచ్చు. ఈ సంచారాల వల్ల వృత్తి పరంగా శుభప్రదంగా, లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ క్రమంలో ప్రమోషన్స్‌ లేదా జీతాల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు పోటీ పరీక్షలో విజయం సాధించవచ్చు. 

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

వృశ్చిక రాశి:
మే నెల వృశ్చిక రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కెరీర్ పరంగా కూడా ఈ రాశివారు మంచి అవకాశాలు పొందుతారు. క్రీడా పోటీలతో సంబంధం ఉన్న ఆటగాళ్లకు ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. 

మకర రాశి:
మకర రాశి వారికి గ్రహ సంచారాల వల్ల చాలా రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గత కొంతకాలంగా సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా విద్యారంగంలో పురోగతి లభించడమేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా మారుతుంది.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News