Mars Transit 2022: మంగళ గ్రహం మేషరాశి ప్రవేశం, జూన్ 27 నుంచి ఏయే రాశులకు ఎలా ఉండబోతోంది

Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో మంగళ గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. మంగళ గ్రహం స్థాన చలనం ప్రభావం చాలా రాశులపై ఉంటుంది. జూన్ 27 నుంచి మంగళగ్రహం స్థానచలనం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడనుందో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2022, 11:50 PM IST
Mars Transit 2022: మంగళ గ్రహం మేషరాశి ప్రవేశం, జూన్ 27 నుంచి ఏయే రాశులకు ఎలా ఉండబోతోంది

Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో మంగళ గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. మంగళ గ్రహం స్థాన చలనం ప్రభావం చాలా రాశులపై ఉంటుంది. జూన్ 27 నుంచి మంగళగ్రహం స్థానచలనం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడనుందో పరిశీలిద్దాం..

జూన్ 27న మంగళగ్రహం మేషరాశిలో ప్రవేశిస్తుంది. ఫలితంగా కొన్ని రాశులకు లాభదాయకంగా, మరికొన్ని రాశులకు నష్టదాయకంగా మారనుంది. జ్యోతిష్యశాస్త్రంలో మంగళగ్రహానికున్న ప్రాధాన్యత దృష్ట్యా..ఏయే రాశులపై ప్రభావం ఎలా ఉండనుందో తెలుసుకోవల్సిన అవసరముంది. 

మేషరాశి జాతకులకు కొత్త వ్యాపారాలు బాగుంటాయి. అటు తల్లిదండ్రుల్నించి ధనలాభం ఉంటుంది. ఈ సమయంలో కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. కొత్త ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇక వృషభరాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తండ్రి నుంచి సహాయం లభిస్తుంది. విద్యార్ధులకు చదువు నిమిత్తం కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా ఇబ్బందులు ఎదురౌతాయి. వ్యాపారంలో మాత్రం లాభాలు ఆర్జిస్తారు. 

మిధునరాశి వారికి మంగళ గ్రహం గోచారం సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. తల్లి నుంచి సహాయం ఉంటుంది. తిండి విషయంలో ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకరాశివారికి చేసేపనిలో శుభసూచకంగా ఉంటుంది. వ్యవసాయంలో ఆదాయం పెరుగుతుంది. మొత్తానికి మంగళగ్రహం స్థానం చలనం ప్రభావం ఈ రాశివారిపై అనుకూలంగా ఉండనుంది.

సింహరాశివారికి ఉద్యోగాల్లో ప్రగతికి అవకాశాలుంటాయి. బాస్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. పనిచేసే చోట విజయం లభిస్తుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థాన చలనం కలిగే అవకాశముంటుంది. కొత్త మిత్రులు సంపాదించుకుంటారు. కన్యారాశివారికి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో బిజీగా ఉంటారు. కానీ లాభాలు ఆర్జిస్తారు. తులరాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారంలో కష్టాలు తప్పవు. ఉద్యోగాల్లో సహకారం ఉంటుంది. పనిచేసే చోట చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వృశ్చికరాశివారికి కూడా ఇబ్బందులు తప్పవు. వ్యాపారంలో కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. కుటుంబసభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 

ధనస్సురాశివారి జాతకంలో మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. తండ్రి తరపు నుంచి సంపద చేరడంతో ధనలాభం ఉంటుంది. ఇతరత్రా మార్గాల్లో ఆదాయం వస్తుంది. మకరరాశివారు పనుల్లో బిజీగా గడుపుతారు. ఉద్యోగ నిమిత్తం విదేశీయాత్ర ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం కూడా పొందుతారు. కుంభరాశివారికి అంతా శుభంగా ఉంటుంది. ఉద్యోగాల్లో, సంపాదనలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణాలుంటాయి. ఇక చివరిగా మీనరాశివారు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం వృద్ది చెందుతుంది. 

Also read: Directions and Idols: ఇంట్లో దేవతల విగ్రహాల్ని ఏ దిశలో ఉంచాలి, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News