/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Tulasi Vastu Tips: హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్క ఎంతో పవిత్రమైంది. అంతేకాదు ఇది విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరం. అందుకే ఆయన పూజలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ప్రత్యేక స్థానం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి బయట పడతారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్క పెట్టుడానికి సరైన దిశ వాస్తు ఉంది. అంతేకాదు, ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు పెట్టుకోవచ్చో  తెలుసుకుందాం.

తులసిమొక్కను ఏర్పాటు చేసుకుంటే వాస్తు ప్రకారం ఆ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కానీ, ఎట్టిపరిస్థితుల్లో సంధ్యకాలంలో తులసి మొక్క ఆకులు తొలగించకూడదు. అంతేకాదు, ఏకాదశి, ఆదివారం రోజుల్లో తులసిమొక్కకు నీరు పోయకూడదు. ఈరోజుల్లో అమ్మవారు ఉపవాసం ఉంటుందని నమ్మకం ఉంది. తులసి మొక్కను ఇతరులకు బహుమతిగా ఇస్తే అది అర్హులైనవారికి మాత్రమే ఇవ్వాలి.ముఖ్యంగా తులసి మొక్కను ఒక కుండీలో నాటుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో నేలపై పెంచుకోవద్దు.జోతిష్యుల ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలను పెంచుకోవచ్చు.  కానీ, వాటికీ నియమాలు ఉన్నాయి.ఇంట్లో తులసిమొక్కల సంఖ్య బేసి సంఖ్యలో ఉండాలి. అంటే ఒకటి, మూడు, ఐదు, ఏడు. ఇంట్లో తులసిమొక్కను నాటుకోవడానికి శుభప్రదమైన రోజు గురువారం.

ఇదీ చదవండి: హోలీ పండగ రోజు ఈ వస్తువులను దానం చేస్తే సమస్యలను, దరిద్రాన్ని మీకు మీరే కొని తెచ్చుకున్నట్లే!

సీజన్ అనుసరించి తులసి మొక్క ఆకులు రాలిపోవడం మళ్లీ తిరిగి పెరగడం జరుగుతుంది. అయితే, ఒక్కోసారి పచ్చని తులసి ఆకులు హఠాత్తుగా నల్లగా మాడిపోతాయి. అది చూసి మనం కంగారు పడతాం. అయితే, తులసి మొక్క ఇలా నల్లబడటం వెనుక వాస్తు దోషాలను కూడా సూచిస్తుందని వాస్త్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసిమొక్క ఇలా నల్లగా మారితే ఇంట్లోకి నెగిటివిటీ కూడా పెరుగుతుందని అర్థం.

ఇదీ చదవండి: వందేళ్లకు హోలీ నాడు చంద్ర గ్రహణం, ఆ 5 రాశులకు తీవ్రనష్టం

అంతేకాదు వాస్తు ప్రకారం తులసి మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజూ తులసిమొక్కను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా దాని దిశకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు ప్రకారం తులసిమొక్క ఇంటికి తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఇతర ముళ్ల చెట్టు వంటి మొక్కల పక్కన పెట్టకూడదు. అయితే, ఇలా తులసి మొక్క ఇంట్లో హఠాత్తుగా నల్లగా మారిపోతే ఆ ఇంటికి ఇబ్బందులు ఎదురవుతాయని అర్థమట. వాస్తు ప్రకారం మన ఇంటికి మంచి రోజులు వస్తే కూడా మొక్క పచ్చగా కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటికి ఆర్థిక సంక్షోభం లేదా ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతే తులసి వాడిపోతుంది. తులసి వాడిపోయిన వెంటనే ఆ కుండీలో మరో మొక్కను నాటుకోవడం శుభం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
do not give water to tulasi plant on these two days of month as per vastu shastra rn
News Source: 
Home Title: 

Tulasi Plant Vastu: తులసిమొక్కకు ఈ నెలలో 2 రోజులు నీరుపోస్తే అపచారం.. ఎప్పుడో తెలుసా?

Tulasi Plant Vastu: తులసిమొక్కకు ఈ నెలలో 2 రోజులు నీరుపోస్తే అపచారం.. ఎప్పుడో తెలుసా?
Caption: 
Tulasi Vastu Tips
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తులసిమొక్కకు ఈ నెలలో 2 రోజులు నీరుపోస్తే అపచారం.. ఎప్పుడో తెలుసా?
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Wednesday, March 20, 2024 - 10:51
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
335