Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు షాక్‌.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

TTD Cancels Special Darshan On The Occasion Of Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు మరో షాక్‌. వచ్చే నెలలో తిరుమల దర్శనానికి వెళ్తుంటే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే! ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 14, 2024, 04:35 PM IST
Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు షాక్‌.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

Vaikuntha Ekadashi: పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే అత్యంత ప్రాశస్త్యం కలిగిన వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో రానున్న వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read: Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్‌.. జమిలి వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే

సూర్యుడు దక్షిణాయాణం చివర్లో.. ఉత్తరాయన ప్రారంభానికి సమీపంలో ఉండడంతో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసే సమయాన్ని ధను సంక్రాంతి అంటారు. ఈ సమయంలోనే ధనుర్మాసం ఏర్పడుతుంది. డిసెంబర్ 16వ తేదీ సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. హిందూ సంప్రదాయంలో ధునుర్మాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వైష్ణవులకు అత్యంత ప్రాముఖ్యమైన నెల ఇది.

Also Read: Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌..

ధునుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశిని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజును పండుగగా పూజలు చేస్తారు. వైకుంఠ ఏకాదశిని తిరుమల ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి జనవరి 10వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా తిరుమలలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో కీలక మార్పులు జరగనున్నాయి.

వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమలలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి  సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం సందర్భంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు

  • దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. కానీ దర్శనం చేసుకునే వీలు ఉండదు.
  • ఈ పది రోజులు ప్రత్యేక దర్శనాలు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ వంటి విశేష దర్శనాలు రద్దు.
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం.
  • భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు పటిష్ట ఏర్పాట్లు.
  • గోవిందమాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి.
  • భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
  •  వైకుంఠ ఏకాదశి రోజున మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్‌లను దర్శనాలకు అనుమతించరు. వీరిని 11 నుంచి 19వ తేది వరకు దర్శనాలకు అనుమతిస్తారు.
  • 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్, గైడ్స్‌ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News