UFO News: హవాయి సముద్రంలో కుప్పకూలిన ఎగిరే పళ్లెం

UFO In Hawaii : సౌరకుటుంబంలో మనుషుల్లా తెలివైన ప్రాణులు ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకోవానికి మనం చేసే ప్రయత్నాలకు.. ఎగిరే పళ్లాలకు దగ్గర సంబంధం ఉంది. ఇతర గ్రహాల నుంచి వచ్చే గ్రహాంతర వాసులు భూమిపై యూఎఫ్ఓల్లో తిరగడం తము చూశాము అని చాలా మంది చెప్పడం.. ఎన్నో వీడియోలు రావడం సాధారణం. తాజాగా హావాయి ద్వీప సమూహంలో కూడా ఇలాంటి ఒక ఘటన వార్తల్లోకి వచ్చింది.  

Last Updated : Jan 4, 2021, 10:12 AM IST
    1. సౌరకుటుంబంలో మనుషుల్లా తెలివైన ప్రాణులు ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకోవానికి మనం చేసే ప్రయత్నాలకు.. ఎగిరే పళ్లాలకు దగ్గర సంబంధం ఉంది.
    2. ఇతర గ్రహాల నుంచి వచ్చే గ్రహాంతర వాసులు భూమిపై యూఎఫ్ఓల్లో తిరగడం తము చూశాము అని చాలా మంది చెప్పడం.. ఎన్నో వీడియోలు రావడం సాధారణం.
    3. తాజాగా హావాయి ద్వీప సమూహంలో కూడా ఇలాంటి ఒక ఘటన వార్తల్లోకి వచ్చింది.
UFO News: హవాయి సముద్రంలో కుప్పకూలిన ఎగిరే పళ్లెం

UFO In Hawaii : సౌరకుటుంబంలో మనుషుల్లా తెలివైన ప్రాణులు ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకోవానికి మనం చేసే ప్రయత్నాలకు.. ఎగిరే పళ్లాలకు దగ్గర సంబంధం ఉంది. ఇతర గ్రహాల నుంచి వచ్చే గ్రహాంతర వాసులు భూమిపై యూఎఫ్ఓల్లో తిరగడం తము చూశాము అని చాలా మంది చెప్పడం.. ఎన్నో వీడియోలు రావడం సాధారణం. తాజాగా హావాయి ద్వీప సమూహంలో కూడా ఇలాంటి ఒక ఘటన వార్తల్లోకి వచ్చింది.

హవాయిలోని కొంత మంది స్థానికులు ఒక నీలి రంగు ఎగిరే పళ్లెం (UFO) చాలా సమయం పాటు గాలిలో సంచరించడానికి చూశారట. ఓహూ (Oahu) అనే ప్రాంతంలో ఈ UFO తిరిగింది.. దీన్ని కొంత మంది స్థానికులు రికార్డు చేశారట. తరువాత అది సముద్రంలో కుప్పకూలింది అని సమాచారం.

ఈ ఘటన గురించి మాట్లాడుతూ మిస్టినా సేప్ అనే యువతి పలు ఆసక్తికరమైన విషయాలు తన వీడియో ద్వారా తెలిపింది. ఆకాశంలో ఒక వింతైన ఆకారం ఉన్న నావ కనిపిస్తోంది..ఏంటది.. అని చుట్టుపక్కల వారిని పిలిచి వారికి కూడా కనిపిస్తోందా అని చెక్ చేసుకుంది. వారికి కూడా కనిపించడంతో వెంటనే 911 అనే నెంబర్‌పై కాల్ చేసి పోలీసులకు (Police) సమాచారం అందించింది. 

పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో విమానాలు లేదా ఫైటర్ జెట్స్ ఏవైనా కూలాయా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అలాంటి ఘటన ఏదీ జరగలేదు అని తెలిసింది. ప్రస్తుతం హవాయిలో గ్రహాంతర వాసుల వాహనం ఏమైంది అనేది మిస్టరీగానే మిగిలిపోయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News