Hundreds of fishermen came to srisailam project for catching fishes: కొన్నిరోజులుగా భారీవర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టులన్ని నిండుకుండలామారాయి. ఎక్కడ చూసిన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీళ్లతో పొంగిపొర్లుతుంది. కృష్ణమ్మ బిర బిర పరవళ్లు తొక్కుతుంది. శ్రీ శైలంలో ప్రాజెక్టులో భారీ నీరు చేరిపోయి ఉండటంతో అధికారులు క్రస్ట్ గేట్లను తెరచి దిగువ ప్రాంతానికి నీళ్లను వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రతిరోజు కూడా వందలాది మంది.. శ్రీశైలంకు చేరుకుని, అక్కడి అందాలను చూస్తున్నారు.
వీకెండ్ లో పెద్ద సంఖ్యలో శ్రీ శైలం ప్రాజెక్టు అందాలను చూడటానికి తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఈ క్రమంలో..సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎగువ జూరాల నుంచి పూర్తిగా నీటి ప్రవాహం నిలిచిపోవడంతో జలాశయం గేట్లను మూసివేశారు. దీంతో మంగళవారం రోజున అక్కడి మత్య్సకారులు భారీ ఎత్తున శ్రీ శైలంజలాశయానికి చేరుకుంటున్నారు.
కొన్నిరోజులుగా ప్రాజెక్టులో భారీ నీరు వస్తుండటంతో, పెద్ద చేపలు జలాశయంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చేపలు పట్టిజీవించే గంగపుత్రులు వందల సంఖ్యలో బోట్లేసుకుని మరీ .. శ్రీశైలం ప్రాజెక్టులోకి వేటకు వెళ్లారు. వందల సంఖ్యలో బోట్లలో గంగపుత్రులు వెళ్లడంతో కొందరు ఆశ్చర్యపోయారు. తొలుత ఏదో ప్రమాదం జరిగిందా.. అని కూడా కొందరు భావించారంట. కానీ చేపల వేట కోసం అని తెలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణంగా వర్షాలు పడిన, నీటి విడుదల అయిన తర్వాత ప్రాజెక్టులో భారీ చేపలు పడుతాయని గంగపుత్రులు చెబుతుంటారు. కనీసం ఒక్కొ చేప పది కేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందని కూడా మత్య్సకారులు చెబుతున్నారు. ఈవీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.