Viral News: ఆ చిరుతపులికి Nobel Peace Prize అవ్వాలి, నెటిజన్ల డిమాండ్‌కు కారణం ఇదే

Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని అంటారు. ఈ కుక్క విషయంలో అది జరిగిందంటూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Feb 4, 2021, 11:53 AM IST
Viral News: ఆ చిరుతపులికి Nobel Peace Prize అవ్వాలి, నెటిజన్ల డిమాండ్‌కు కారణం ఇదే

Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: సాధారణంగా క్రూర జంతువులకు ఇతర ప్రాణులు ఏం కనిపించినా వాటిని వేటాడి వెంటాడి భక్షిస్తాయి. అయితే కర్ణాటకలో విచిత్రం చోటుచేసుకుంది. ఒకే గదిలో ఉన్నప్పటికీ ఓ చిరుతపులి సహజధోరణికి భిన్నంగా వ్యవహరించింది. ఆ చిరుతకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటకలోని బిలినెలె గ్రామంలో ఓ టాయ్‌లెట్‌లో కుక్క, చిరుత కనిపించాయి. వెంటనే ఓ మహిళ బయటనుంచి టాయ్‌లెట్‌ డోర్ లాక్ చేసింది. దాదాపు 7 గంటలపాటు అవి అందులోనే ఉండిపోయాయి. దీనిపై ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్వీట్ చేశారు. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది. ఓ టాయ్‌లెట్‌‌లో చిరుతపులి(Leopard)తో పాటు కుక్క గంటల తరబడి అలాగే ఉండిపోయింది. ప్రాణాలతో బయటపడింది. ఇది కేవలం భారత్‌(India)లో సాధ్యమని పోస్ట్ చేశారు.

Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి

ఈ ఫొటో చూసి వెంటనే నెటిజన్లు సోషల్ మీడియా(Social Media)లో తమ చేతికి పని చెప్పారు. ఇంత శాంతియుతంగా వ్యవహరించిన చిరుతపులికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే కరోనా సమయం కదా, సోషల్ డిస్టాన్సింక్ బాగా పాటించాయని అభినందిస్తున్నారు. 

Also Read: Gold Price Today 04 February: మళ్లీ పతనమైన Gold Price, క్షీణించిన Silver Rate 

 

మరికొందరు నెటిజన్లు కుక్క ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తన తప్పు లేకున్నా, చావుకు సిద్ధం చేసిన కుక్క ఎంతో తెగువ చూపించంటూ ఛలోక్తులు విసురుతున్నారు. నెటిజన్లు చేసిన మరికొన్ని కామెంట్లు ఇక్కడ మీకు అందిస్తున్నాం.

Also Read: Today Horoscope, 04 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 4, 2021 Rasi Phalalu

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News