Venomous snake cobra viral video: సోషల్ మీడియాలో ప్రతిరోజు బోలేడు పాముల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని చూస్తుంటే భయంకరంగాను, మరికొన్ని చూస్తుంటే వెన్నులో వణుకుపుట్టించేవిలా ఉంటాయి. అయిన కూడా ఏం విడ్డూరమోకానీ నెటిజన్లు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే పాముల వీడియోలకు నెట్టింట ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు.
అంతే కాకుండా.. వెరైటీగా ఉండే పాములు వీడియోలను నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసి మరీ వెతికి చూస్తున్నారు. పాముల వీడియోలు వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మరో పాముల వీడియో తెగ వైరల్ గా మారింది. ఇక్కడ ఒక వ్యక్తి పామును చేతిలో పెట్టుకుని దాన్ని ఆడిస్తున్నాడు. అతగాడు.. కళ్లద్దాలు వేసుకుని మరీ పామును ఆడిస్తున్నాడు. కానీ ఆ పాము మాత్రం అతని చేతుల్లో నుంచి విడిపించుకునేందుకు నానా తంటాలు పడుతుంది.
— Fck Around N Find Out (@FAFO_TV) July 6, 2024
ఇంతలో అతగాడు కాస్తంతా అతిగా చేశారు. పాము ఎలాగైన అతగాడికి బుద్ది చెప్పాలని అనుకుందో ఏంటో కానీ అతడి మీద ఉమ్మి వేసింది. ఈ ఘటనతో అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతని లక్ బాగుందో మరేంటో కానీ.. ఆ పాము విషం అతని కళ్లద్దాల మీద పడింది.
Read more: Viral Video: వామ్మో.. ఒక అరటి పండు రూ. 100.. హైదరబాద్‌లో ఫారెనర్ కు షాకింగ్ అనుభవం.. వీడియో వైరల్..
దీంతో వెంట్రుక వాసిలో అతను ప్రాణాలతో బైటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. స్నేక్ తో ఈ పరాచకాలు అవసరమా.. అంటూ అతడ్ని ఏకీ పారేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter