Actress Abhinaya: మహేశ్ బాబు చెల్లి, ఎన్టీఆర్ అక్క.. మాటలు రాని.. వినపడని హీరోయిన్ ఎవరో తెలుసా?

Deaf And Dumb Actress Works In 59 Films Who Is She?: తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది భాషల్లో ఓ దివ్యాంగ హీరోయిన్‌ సినిమాల్లో రాణిస్తోంది. అగ్ర హీరోలతోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె మహేశ్‌ బాబుకు చెల్లిగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు అక్కగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు మాటలు రావు.. చెవులు వినపడవు. కానీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఆ హీరోయిన్‌ గురించి తెలుసుకుందాం.

1 /8

సినీ పరిశ్రమలో శారీరకంగా ఫిట్‌గా.. అందంగా ఉన్నా కూడా అవకాశాలు దొరకవు. అలాంటిది దివ్యాంగురాలు సినిమాల్లో హీరోయిన్‌కు సమానంగా నటిస్తున్న ఓ హీరోయిన్‌ ఉంది తెలుసా? ఆమె ఎవరో బుర్రకు పదును పెట్టండి.

2 /8

ఆమెకు నోటి నుంచి మాటలు రావు. కానీ చక్కగా హావభావాలు పలికిస్తుంది. ఆమెకు చెవులు వినిపించవు. కానీ అందంగా నవ్వుతూ సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బధిర హీరోయిన్‌ ఎవరో కాదు అభినయ.

3 /8

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్‌, మహేశ్‌ బాబు సోదరిగా అభినయ నటించారు. ఆమె పెళ్లి సన్నివేశాలు ఆ సినిమాలో హైలెట్‌గా నిలిచాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దమ్ము' సినిమాలో అక్క పాత్రలో అభినయ మెరిశారు.

4 /8

తెలుగుతోపాటు దక్షిణ భాషల్లో రాణిస్తున్న అభినయ తమిళనాడుకు చెందింది. ఆమెకు పుట్టుక నుంచే చెవులు వినపడవు. మాటలు కూడా రాలేదు. బధిర యువతిగా ఉన్నా కూడా అందంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను నటనలో ప్రోత్సహించారు.

5 /8

నటనలో రాణించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. పరిశ్రమలో ఈ స్థాయిలో ఉండడానికి కుటుంబసభ్యులే కారణమని పలు ఇంటర్వ్యూల్లో తన సైగల ద్వారా అభినయ తెలిపింది.

6 /8

రవితేజ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'నేనింతే' సినిమాతో తెలుగు పరిశ్రమకు అభినయ పరిచయమైంది. అనంతరం చాలా సినిమాల్లో ఆమె నటించింది. 18 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అభినయ ఇప్పటివరకు దాదాపు 60 సినిమాలు చేసింది.

7 /8

శంభో శివ శంభో, కింగ్‌, ఢమరుకం, జీనియస్‌, రాజుగారి గది 2, ధ్రువ, సీతారామం, గామి, ఫ్యామిలీ స్టార్‌ వంటి సినిమాలతోపాటు మరికొన్నింటిలో అభినయ నటించి ప్రేక్షకుల అభిమానం పొందింది. 

8 /8

ప్రస్తుతం మలయాళంలో ఓటీటీలో విడుదలైన 'పని' అనే సినిమాలో అభినయ నటించింది. జోజూ జార్జ్‌ నటించిన ఈ సినిమాలో అభినయ నటించిన ఓ సన్నివేశం వివాదాస్పదం కావడంతో మరోసారి అభినయ ప్రేక్షకుల దృష్టిలో పడింది.