Trump Coin: క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ట్రంప్ కాయిన్ భారీ ప్రకంపనలు సృష్టిస్తుంది. లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే 300 శాతం పెరిగి 6.76 బిలియన్ డాలర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హిట్ చేసింది.
Trump Coin: క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ట్రంప్ కాయిన్ సంచలనం క్రియేట్ చేస్తుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి రెండు రోజుల ముందు లాంచ్ అయిన ఈ కాయిన్ కొన్ని గంటల వ్యవధిలోని 300% పెరిగింది. దీంతో ఏకంగా 6.76బిలియన్ డాలర్ల పీక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కి చేరుకుంది. దీనిని ట్రంప్ కాయిన్ అని, ట్రంప్ మీమ్ కాయిన్ అని పిలుస్తున్నారు. ఈ ట్రంప్ మీమ్ కాయిన్ వ్యాల్యూ అమాంతం పెరగడంతో ఇప్పుడు అందరు చూపు దీని పైనే పడింది .
ఇవి ఇతర డిజిటల్ కరెన్సీగా మాదిరిగానే ఈ ట్రంప్ మీమ్ కాయిన్స్ పనిచేస్తుంటాయి. వీటితో పాటు ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయవచ్చు. ఈ కాయిన్ 33.87 డాలర్లుగా నమోదు అయ్యింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ ఎక్స్ లో ఈ క్రిప్టో కరెన్సీని ప్రకటించారు. తన నాయకత్వానికి, స్థితిస్థాపకతకు సూచికగా ఈ ట్రంప్ కాయిన్ అంటూ అభివర్ణించారు.
మీమ్ కాయిన్స్ తరచుగా ఇంటర్నెట్ ట్రైన్స్ వ్యక్తిత్వాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇవి అంతర్గత విలువలను కలిగి ఉండవు. కానీ ఊహాజనిత ప్రయోజనాల కోసం వీటిలో విస్తృతంగా ట్రేడింగ్ జరుగుతుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. వెనక్కి తగ్గని నాయకుడిని ఈ ట్రంప్ మీమ్ సెలబ్రేట్ చేస్తుందని కాయిన్ అధికారిక వెబ్సైట్ వెల్లడించింది.
ఇందులో 2024 జూలైలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం గురించి ప్రస్తావించడం ఈ కాయిన్స్ ప్రాముఖ్యతను మరింత పెంచేసింది. వాస్తవానికి క్రిప్టో కమ్యూనిటీ మొదటిలో ఈ ట్రంప్ కాయిన్ చట్టబద్ధతను ట్రంప్ తో దాని అధికారిక సంబంధాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. కుంభకోణాలపై ఆందోళనలు విస్తృతంగా వ్యాపింపజేసింది.
అయితే ట్రంప్ వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాల వినియోగం గతంలో ట్రంప్ ఎన్ ఎఫ్ టి వెంచర్లతో సంబంధం ఉన్న సిఐసి డిజిటల్ ఎల్ఎల్సీ కంపెనీ ప్రమేయం ఉండడంతో ఇన్వెస్టర్లకు భరోసా పెరిగింది. శనివారం మధ్యాహ్నం వరకల్లా ట్రంప్ కాయిన్ దాదాపు ఆర్ బిలియన్ మార్కెట్ క్యాప్టలైజేషన్ కి చేరుకుంది. ఇది బలమైన డిమాండ్ ను ప్రతిబింబిస్తుంది.
అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రారంభ లాంచ్ లో 200 మిలియన్ ట్రంప్ మెయిన్ కాయిన్లు జారీ అయ్యాయి. వచ్చే మూడేళ్లలో అదనంగా 800 మిలియన్ ట్రంప్ కాయిన్స్ ను రిలీజ్ చేయనున్నట్లు ఫైట్ ఫైట్ ఎల్ఎల్సీ ప్రకటించింది.
అయితే మొదటి బ్యాచ్ మీమ్ కాయిన్స్ నుంచి ట్రంప్ ఎంత సంపాదించారో ఆయనతో పాటు ఫైట్ ఫైట్ ఎల్ఐసి ఇంకా వెల్లడించలేదు. కాగా అస్థిరమైన కాయిన్ మార్కెట్లో ఈ కాయిన్ ట్రంప్ ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్క్ ఉంటుంది. అనే విషయాలపై మార్కెట్ విశ్లేషకులు ఆసక్తిగా ఉన్నారు.