Indian Cricketers have less captaincy skills than Australia says Anjum Chopra: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) తొలి ఎడిషన్ శనివారం అట్టహాసంగా ప్రారంభం అయింది. బీసీసీఐ ఆధ్వర్యంలో తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. డీవై పాటిల్ స్టేడియంలో మరికాసేపట్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. 5 జట్లతో సాగే తొలి సీజన్‌లో మొత్తం 18 రోజుల్లో 22 మ్యాచ్‌లు జరుగునున్న విషయం తెలిసిందే.
తొలి మహిళా ప్రీమియర్ లీగ్ (WPL 2023)లో ఐదు జట్లు ఉండగా.. రెండు జట్లకు మాత్రమే భారత స్టార్ ప్లేయర్లు కెప్టెన్‌గా ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్మృతి మంధానాలు కెప్టెన్‌లుగా ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్), బెత్ మూనీ (గుజరాత్ జెయింట్స్) మరియు అలిస్సా హీలీ (యూపీ వారియర్జ్) జట్లకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కెప్టెన్‌ల విషయంలో భారత మహిళా జట్టు కెప్టెన్ అంజుమ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు.
'తొలి మహిళా ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ ఫ్రాంచైజీలు విదేశీ క్రికెటర్లను కెప్టెన్‌గా నియమించుకున్నాయి. ఇది భారత క్రికెట్ లీగ్. స్వదేశంలోని పరిస్థితుల్లో ఆడుతున్నారు కాబట్టి సామర్థ్యం కలిగిన భారత ప్లేయర్లకే కెప్టెన్సీ అప్పగిస్తే బాగుండేది. దీప్తి శర్మ సారథిగా జట్టును నడిపించగలదు. ఇప్పటికే ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. అయితే భారత ప్లేయర్లతో పోలిస్తే.. ఆసీస్ క్రికెటర్లు అనుభవం ఎక్కువే. అయినా కూడా స్వదేశంలో భారత అమ్మాయిలకే జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది' అని అంజుమ్ చోప్రా అన్నారు.
'అనుభవపరంగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న మెగ్ లానింగ్‌ను కాదని జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ ఇవ్వలేరు. సహజంగా చూసుకుంటే ఆసీస్ ప్లేయర్లతో పోలిస్తే భారత క్రికెటర్లకు కెప్టెన్సీ సామర్థ్యం తక్కువే. క్రికెట్ ప్రొఫెషనల్ గేమ్. పరిస్థితులను త్వరగా అలవర్చుకొని.. ఇతర ప్లేయర్ల నుంచి నేర్చుకుంటూ ముందుకు పోవాలి. దేశీయ క్రికెటర్లు ఇందులో కీలక పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నా. అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం అద్భుతం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు భారత క్రికెట్‌కు ఎన్నో సవాళ్లు విసిరాయి.ఈ టోర్నీ తప్పకుండా భారత క్రికెట్‌కు సాయపడుతుంది' అని అంజుమ్ చోప్రా చెప్పారు.
Also Read: Pathaan Collections: బాహుబలి-2 రికార్డు బద్దలు.. ఆల్ టైమ్ రికార్డు సినిమాగా 'పఠాన్'!
Also Read: TATA WPL 2023: డబ్ల్యూపీఎల్ 2023 ఆరంభం.. సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు! మ్యాచ్ రీ షెడ్యూల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.