Delhi Capitals buy Jemimah Rodrigues for Rs 2.2 Crores: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం 2023లో భారత స్టార్ బ్యాటర్ జెమియా రోడ్రిగ్స్ జాక్ పాట్ కొట్టింది. ఈ రోజు ముంబైలో జరిగిన డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో రోడ్రిగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.2 కోట్లకు సొంతం చేసుకుంది. ముందుగా యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్ మధ్య రోడ్రిగ్స్ కోసం పోటీ నడిచింది. వేలం జోరుగా సాగుతున్న సమయంలో ఢిల్లీ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ, యూపీ మధ్య వేలం హోరాహోరీగా సాగింది. చివరకు రోడ్రిగ్స్‌ను ఢిల్లీ దక్కించుకుంది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (53 నాటౌట్; 38 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మంచి ఫామ్‌లో రోడ్రిగ్స్.. వేలానికి ఒక రోజు ముందు హాఫ్ సెంచరీ బాదడం కూడా కలిసొచ్చింది చెప్పాలి. 2018లో టీ20 అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్ 1600కి పైగా పరుగులు చేసింది. 1000 టీ220 పరుగులను అత్యంత వేగంగా సాధించిన రెండవ భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పింది.
ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్‌ని ముంబై ఇండియన్స్ రూ.3.20 కోట్లకు కైవసం చేసుకుంది. సీవర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీ పడ్డాయి. చివరకు ముంబై దక్కించుకుంది. ఆస్ట్రేలియా రన్ మెషీన్ బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు దక్కించుకుంది. బెత్ మూనీని దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. అయితే అనూహ్యంగా గుజరాత్ పోటీలోకి వచ్చి ఎగరేసుకుపోయింది.
భారత బౌలర్ దీప్తి శర్మ వేలంలో భారీ ధర పలికింది. ముంబై, ఢిల్లీ, గుజరాత్, యూపీ ఆమె కోసం పోటీ పడాయి. దీప్తిని దక్కించుకునేందుకు ముంబై ప్రయత్నించినా.. యూపీ రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది. ఇక భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మను సైతం అదృష్టం వరించింది. రూ. 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటిల్స్ ఆమెను దక్కించుకుంది.
Also Read: WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. స్మృతి మంధాన రేటు ఎంతో తెలుసా?
Also Read: iPhone 14 Discounts: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఏకంగా 42 వేల తగ్గింపు! లిమిటెడ్ పీరియడ్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.