5% GST on Rice: మానవ వినియోగానికి కాకుండా ఇతర వాణిజ్య అవసరాలు లేదా పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే బియ్యంపై 5 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వర్తించనుంది " అని ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ (AAR) స్పష్టంచేసింది. వివిధ కారణాలతో మానవ వినియోగానికి పనికిరాని వడ్లు, బియ్యాన్ని ఇతరత్రా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తారు అనే విషయం తెలిసిందే. అలా మానవేతర అవసరాలకు ఉపయోగించే ధాన్యంపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ తేల్చిచెప్పింది.
మానవ వినియోగానికి తిరస్కరణకు గురైన వరి ధాన్యం, బియ్యం విషయంలో జిఎస్టీ వర్తిస్తుందా ? అని శ్రద్ధా ట్రేడర్స్ అనే రైస్ మిల్ నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మానవుల ఆహారానికి పనికిరాకుండా పోయిన ధాన్యాన్ని డైరీ ఫామ్ ఇండస్ట్రీలో క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీలో కోళ్ల పెంపకంతో పాటు ఇనేక ఇతర అవసరాలకు ఉపయోగించడం తెలిసిందే. ఆదాయం అందించే ఎలాంటి వాణిజ్య అవసరాలు అయినా.. అవి వ్యాపారం పరిధిలోకి వచ్చేవే కావడం వల్లే ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే గత వారం జరిగిన జిఎస్టీ 48వ సమావేశంలో పప్పుధాన్యాలతో పాటు ఇథైల్ అల్కహాల్పై 5 శాతం జిఎస్టీ రేటు తగ్గించాలనే నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్
ఇది కూడా చదవండి : Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో కస్టమర్స్‌కి గుడ్ న్యూస్.. రోజుకు 2.5GB డేటా
ఇది కూడా చదవండి : Indian Govt Corona Advisory: కరోనా అలెర్ట్.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook