Yatra 2 Update: యాత్ర 2కి ఏమైంది.. ఈ వ్యూహాలు. శపధాలు పని చేస్తాయా?

Yatra 2 Movie Update: గతంలో సూపర్ హిట్ గా నిలిచిన యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 సినిమా ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు ఆ సినిమా ఊసే తీయడం మానేశారు. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే?

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 30, 2022, 06:16 PM IST
Yatra 2 Update:  యాత్ర 2కి ఏమైంది.. ఈ వ్యూహాలు. శపధాలు పని చేస్తాయా?

Yatra 2 Movie Update: ఈ మధ్య కాలంలో బయోపిక్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి అన్ని బయోపిక్ సినిమాలు ఆకట్టుకోకున్నా చాలా వరకు హిట్ అవుతూ ఉంటాయి. ఇక సరిగ్గా 2019 ఎన్నికల ముందు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేయగా ఆ తర్వాత వైసీపీకి పూర్తిస్థాయిలో ఫీవర్ చేసేందుకేనా? అన్నట్టుగా గతంలో ఆనందో బ్రహ్మ వంటి సినిమా డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ యాత్ర అనే సినిమా చేశారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో సాగిన ఈ సినిమా మొత్తం మీద జగన్ ప్రస్తావన ఏ మాత్రం ఉండదు కానీ వైసీపీ అభిమానులకు అలాగే వైయస్సార్ అభిమానులకు జగన్ మీద ప్రేమ కలిగే విధంగా మాత్రం సినిమా రూపొందించారు. ఆ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో రెండో భాగం కూడా తెరకెక్కిస్తారని సరిగ్గా 2024 ఎన్నికల ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది .

కానీ ఇప్పుడు ఆ మేరకు ప్రయత్నాలు ఏవీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అవ్వడమే గాక ఆ తరువాత రోజు వ్యూహం, శపథం అంటూ రెండు సినిమాలు చేస్తున్నానని ఆయన ప్రకటించారు..

కానీ ఈ యాత్ర సినిమా విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు సో ఈ వ్యూహం శబదం వాళ్లలో పడి యాత్ర 2 సినిమా పక్కన పెట్టేశారా లేక అసలు సినిమా చేసే ఉద్దేశం లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  నిజానికి ఫామ్ లో లేని వ‌ర్మ‌తో రెండు సినిమాలు చేయించుకోవడం కంటే సెన్సిబుల్ గా జనాన్ని ఆకట్టుకునేలా సినిమా చేయగల సమర్ధత ఉన్న మహీ వీ రాఘవతో ఒక సినిమా చేసినా వర్కౌట్ అవుతుందని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అయితే వైసీపీ ఆంతర్యం ఏమిటో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. 

Also Read: Pushpa: The Rule: పని మొదలెట్టిన అల్లు అర్జున్.. ఆ ఫోటో షేర్ చేయడంతో మేటర్ లీక్!

Also Read: Actress Vinaya Prasad: ప్రముఖ నటి ఇంట చోరీ.. దీపావళికి వెళ్లి వచ్చేలోపు ఇల్లంతా ఊడ్చేశారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News