Rekha Boj Sensational Comments on Tollywood for not taking telugu Girls as Heroines: తెలుగులో రంగీలా, దామిని విల్లా వంటి పలు సినిమాల్లో నటించిన రేఖ భోజ్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాంతారా సినిమా కేవలం కన్నడ వ్యాప్తంగానే గాక మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదలై మంచి టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సప్తమి గౌడ నటించింది. అయితే ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ రేఖ బోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
గతంలో కేజిఎఫ్ సినిమాలో శ్రీనిధి శెట్టి, ఇప్పుడు కాంతార సినిమాలో సప్తమి గౌడ ఇలా కన్నడ సినీ పరిశ్రమ వాళ్ళు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు, ఇది చూసైనా మన దర్శకులు కాస్త బుద్ధి తెచ్చుకోవాలని రేఖ పేర్కొంది. ఇవి కాకుండా కన్నడ సినీ పరిశ్రమలో రంగితరంగ,ముంగారుమలై, దునియా, కిరిక్ పార్టీ ఇలా పలు హిట్ సినిమాలలో కూడా కన్నడ అమ్మాయిలని హీరోయిన్లుగా తీసుకున్నారు. అంత ఎందుకు కార్తికేయ 2 సినిమాలో ఆ మలయాళీ అమ్మాయి కాకుండా ఒక తెలుగు అమ్మాయిని తీసుకున్న కూడా ఆ మూవీ అలాగే ఆడుతుంది.
మన సబ్జెక్టులో అండ్ మన జీ(గుండెలో)లో దమ్ము ఉండాలి కానీ ఆ నార్త్, అండ్ మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేదేమీ ఉండదు. డైలాగ్ చెప్పమంటే జీరో ఎక్స్ప్రెషన్ తో అప్పడాలు వడియాలు పెట్టేలా నీళ్లు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి. మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, చివరి రెండు వరుసల హీరోలు అయిన రాజ్ తరుణ్, కార్తికేయ, విష్వక్సేన్ లాంటి వాళ్లు ఇంకా లాస్ట్ హీరోలు కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ ( కీరవాణి గారి సన్), సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు.
అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాల్లో వాళ్ళు ఆ నేటివిటికి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలని తీసుకుంటారు కానీ అదే సినిమాలు మనవాళ్లు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళని పెడతారు. అక్కడ సైడ్ యాక్టర్స్ అయిన నారప్ప, మాస్టర్ మూవీలో అమ్మాయిలను మన వాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లు వాళ్ళ లాంగ్వేజ్ లోనే హీరోయిన్స్ కాదని రేఖ పేర్కొంది. అసలు చివరికి అందరూ, అసలు సినిమాల కింద లెక్క చేయని మా వైజాగ్ ఫిలిమ్స్ లో కూడా అమ్మాయిలకు స్థానం లేదు, ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ దరిద్రం అంటూ ఆమె ఘాటు కామెంట్స్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook