Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ.. నెక్స్ట్ కవితేనా?

Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతు.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది.ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది

Written by - Srisailam | Last Updated : Sep 19, 2022, 08:13 AM IST
  • లిక్కర్ స్కాంలో మరో సంచలనం
  • రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ
  • మరికొందరికి ఈడీ నోటీసులు
Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. రామచంద్రన్ ను ప్రశ్నించిన ఈడీ.. నెక్స్ట్ కవితేనా?

Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఇటీవలే హైదరాబాద్ లో సహా పలు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేసిన ఈడీ.. తాజాగా  ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాంలో మొదటి నుంచి రామచంద్రన్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కేంద్రంగానే డీల్స్ జరిగాయనే ప్రచారం సాగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్రన్ సన్నిహితుడనే వార్తలు వచ్చాయి. కవిత కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలను తెలంగాణ బీజేపీ నేతలు విడుదల చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత లింకులకు సంబంధించిన ఆధారాలు ఈడీకి లభించాయనే ప్రచారం సాగింది. తాజాగా రామచంద్రన్ పిళ్లైను ఈడీ అధికారులు ప్రశ్నించడం సంచలనంగా మారింది.

లిక్కర్ స్కాం గురించి రామచంద్రన్ నుంచి పలు వివరాలు రాబట్టిన ఈడీ అధికారులు.. కుంభకోణంలో అతని పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది.  ముడుపులు ఎవరెవరికి వెళ్లాయి... ఎవరి నుంచి వెళ్లాయనే విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించారని  తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతర వ్యక్తులతో అతనికి ఉన్న సంబంధాలపైనా ఆరా తీశారని సమాచారం. ఢిల్లీ సర్కార్ నిర్వహించిన లిక్కర్ షాపుల టెండర్లలో హైదరాబాద్ కు చెందిన ఐదారుగురు మద్యం వ్యాపారులు కీలకంగా వ్యవహరించారని సీబీఐ గుర్తించింది. ఈ డీల్ అంతా రామచంద్రన్ పిళ్లై డైరెక్షన్ లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇండో స్పిరిట్స్ సహా పలు కంపెనీల నుంచి డబ్బులు తీసుకున్న రామచంద్రన్ పిళ్ళై ..ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధుల ద్వారా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అందించారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు దర్యాప్తు సంస్థలకు లభించాయని తెలుస్తోంది.

ఇండో స్పిరిట్ సంస్థకు లిక్కర్ టెండర్ దక్కేలా 2 కోట్ల 30 లక్షల రూపాయలను ఆప్ నేతలకు రామచంద్రన్ పిళ్లై ఇచ్చారని ఢిల్లీ  బీజేపీ నేతలు ఆరోపించారు.ఇందుకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.దీనిపైనే రామచంద్రన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారని అంటున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో పాటు ఆప్ నేతలకు డబ్బులు ఎందుకు ఇచ్చారనే వివరాలు తీసుకున్నారని అంటున్నారు. సోమవారం కూడా ఈడీ అధికారులు రామచంద్రన్ ను ప్రశ్నించనున్నారు.ఈ కేసులో మరో ముగ్గురిని కూడా ఈడీ ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. రామచంద్రన్ పిళ్లై డైరెక్టర్ గా ఉన్నరాబిన్ డిస్టిల్లరీ, రాబిన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న ఇతర వ్యాపారులను ప్రశ్నించనున్నారని సమాచారం.

రామచంద్రన్ తో వ్యాపార సంబంధాలు ఉన్న అభిషేక్ బోయినపల్లి, గండ్ర ప్రేమ్ సాగర్ రావు ను విచారించనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు అభిషేక్ అత్యంత సన్నిహితుడు. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఈడీ సోదాలు చేసింది. రామచంద్రన్ పిళ్లై నివాసం, సంస్థలతో పాటు సీఏ  గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. ఎమ్మెల్సీ కవితకు పర్సనల్ ఆడిటర్‌గా ఉన్నారు గోరంట్ల బుచ్చిబాబు. గోరంట్ల అసోసియేట్స్ సంస్థలో దాదాపు 16 గంటల పాటు సోదాలు జరిపింది. దీంతో లిక్కర్ స్కాంలో కవిత టార్గెట్ గానే ఈడీ దూకుడు కొనసాగుతుందని తెలుస్తోంది.

Also read:  ప్రమోషన్స్ చేసిన వెబ్ సైట్లే చెత్త వెబ్ సైట్లు.. అలా టార్గెట్ చేస్తున్న డైరెక్టర్లు!

Also read: China Accident: చైనాలో మరోసారి రోడ్‌టెర్రర్..27 మంది మృతి, మరో 20 మందికి గాయాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

 

Trending News