డీఎంకే పార్టీ నేత ఎంకే స్టాలిన్ కర్ణాటకలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన బీఎస్ యెడ్యూరప్పకు అభినందనలు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బీఎస్ యెడ్యూరప్పను అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన స్టాలిన్.. ''ఇకపై కర్ణాటకలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వమైనా సుప్రీం కోర్టు తీర్పుతో విభేదించకుండా తమిళనాడుకు ఇవ్వాల్సి వున్న కావేరి జలాలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నాను'' అని అందులో విజ్ఞప్తి చేశారు.
கர்நாடக தேர்தலில் வெற்றி பெற்று ஆட்சியமைக்கும் திரு. எடியூரப்பா அவர்களுக்கு வாழ்த்துகள். புதிதாக பொறுப்பேற்கும் பா.ஜ.க அரசு உச்சநீதிமன்ற தீர்ப்பின்படி, தமிழக காவிரி உரிமையை மீறாமல் விரைவில் தமிழகத்திற்கு உரிய காவிரி நீரை திறக்க வேண்டுமென்று வலியுறுத்துகிறேன். #KaranatakaVerdict
— M.K.Stalin (@mkstalin) May 15, 2018
కావేరి నది జలాల పంపకం విషయంలో తలెత్తిన వివాదమై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్పను అభినందిస్తూ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
యెడ్యూరప్పను అభినందించిన స్టాలిన్!