Face Care Tips: స్కిన్‌కేర్ బ్యూటీ కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేసియల్ బ్యూటీ కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ రోజ్ వాటర్‌తో కొన్ని వస్తువులు కలిపి వినియోగిస్తే..మీ అందానికి ఏ సమస్యా రాదు.
ఫేసియల్ లేదా స్కిన్ కేర్ బ్యూటీలో రోజ్ వాటర్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. రోజ్ వాటర్ వినియోగిస్తే..ముఖానికి ఫ్రెష్‌నెస్ వస్తుంది. రోజ్ వాటర్ అనేది ముఖాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా..మచ్చలు, మరకల్లేకుండా చేస్తుంది. మీ ముఖానికి నిగారింపు కోరుకుంటే..రోజ్ వాటర్ ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..
ప్రతిరోజూ అద్దం ముందు నిలుచున్నప్పుడు ముఖంపై మచ్చలు, మరకలు లేదా ముఖం కాంతి ఉందా లేదా అనేది పరిశీలనగా చూస్తుంటాం. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా కేర్ తీసుకుంటారు. ముఖంపై మరకలు లేదా మచ్చల నుంచి ఉపశమనం పొందాలంటే సహజసిద్ధమైన చిట్కాలే మంచి ఫలితాలనిస్తాయి. ఇందులో ప్రముఖమైంది రోజ్ వాటర్. రోజ్ వాటర్‌తో మీ అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. ముఖాన్ని క్లీన్ చేసుకోవచ్చు.
రోజూ ఉదయం, రాత్రి రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేస్తుండాలి. ముందుగా కాటన్ బాల్ ఒకటి తీసుకుని రోజ్ వాటర్ ముంచి ముఖానికి బాగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. ముఖానికి నిగారింపు వస్తుంది. కెమికల్స్‌తో కూడిన లేదా కెమికల్స్ లేని ఫేస్‌వాష్, లేదా స్క్రబ్ కొనుగోలు చేసేకంటే..ఇంట్లో సొంతంగా ఫేస్‌వాష్ లేదా స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా పెసరపప్పు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ పౌడర్ సిద్ధంగా ఉంచుకోవాలి. రోజూ ఉదయం కొద్దిగా పౌడర్ తీసుకుని రోజ్ వాటర్ కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తుండాలి.
రోజ్ వాటర్‌తో మిక్స్ చేసే మరో ముఖ్య పదార్ధం ముల్తానీ మిట్టీ. ముల్తానీ మిట్టీని సాధారణ నీళ్లలో నానబెట్టి..ఆ మిశ్రమంగా చేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఆ తరువాత ముఖానికి బాగా రాసుకోవాలి. ఓ పది నిమిషాలుంచి..చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే ముఖానికి సంబంధించిన సమస్యలు దూరమౌతాయి.
Also read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట ఇలాంటి ఆహారం తప్పకుండా తీసుకోవాలి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook