Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసి ముద్దయింది. శుక్రవారం నగరం నలుమూలలా భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రామంతపూర్, యాకుత్‌పురా, జీడిమెట్ల, యుసూఫ్‌గూడాతో పాటు సిటీలోని అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంకొన్ని చోట్ల చెట్ల కొమ్మలు రాలిపడ్డాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు విద్యుత్ స్తంభాలు నేలకొరిగి కొన్నిచోట్లా.. ఎడతెరిపి లేని భారీ వర్షం కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఇంకొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపేశారు.
నగరంలో నేడు నమోదైన వర్షాపాతం వివరాలిలా ఉన్నాయి.
రామంతపూర్‌లో 4.6 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 4.1 సెంటీమీటర్లు, హఫీజ్‌పేట్‌లో 3.5 సెంటీమీటర్లు, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఆర్సీపురం ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షాపాతం నమోదైంది. అలాగే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో 2.9 సెంటీమీటర్లు చొప్పున, డబీర్‌పురాలో 2.8 సెంటీమీటర్లు చొప్పున, బన్సీలాల్‌పేట్, బాలానగర్‌లో 2.7 సెంటీమీటర్లు చొప్పున.. బోరబండ, అంబర్‌పేట్ ముషీరాబాద్ ప్రాంతాల్లో 2.6 సెంటీమీటర్లు చొప్పున వర్షాపాతం నమోదైంది.
సీతాఫల్‌మండి, నారాయణగూడ, బేగంపేట్‌లో 2.5 సెంటీమీటర్లు.. మూసాపేట్, నాంపల్లి ప్రాంతాల్లో 2.4 సెంటీమీటర్లు, చార్మినార్, ఆసిఫ్ నగర్, మోండా మార్కెట్లో 2.3 సెంటీమీటర్లు.. సరూర్‌నగర్, యూసుఫ్‌గూడా, అబిడ్స్‌లో 2 సెంటీమీటర్లు చొప్పున వర్షం కురిసింది. అల్వాల్, చంద్రాయణగుట్టలో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నోర్లు తెరుచుకున్న మ్యాన్‌హోళ్లతో ప్రమాదం పొంచి ఉంటుందనే భయం నగరవాసులను వెంటాడుతోంది. ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని, అవసరమైన చోట సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నగర మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీచేసినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జాడ కనిపించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల పోలీసులు, జీహెచ్ఎంసీ బృందాలు కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.
Also read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?
Also Read : YS Vijayamma: విజయమ్మ తప్పుకుందా.. తప్పించారా! ఇడుపాలపాయలో రాత్రి ఏం జరిగింది..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Hyderabad Rains Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎక్కడెక్కడ ఎంత వర్షం కురిసిందంటే