Etela Rajender: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీఆర్ఎస్ సర్కార్. ఈటలకు చెందిన వివాదాస్పద జమునా హెచరీస్ భూములకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. జమునా హెచరీస్ సంస్థ దళితుల నుంచి అసైన్జ్ భూములు కొనుగోలు చేసిందని గతంలోనే జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. దీంతో ఈటల చేతిలో ఉన్న భూములను లబ్దిదారులపై తిరిగి ఇవ్వాలని డిసైడ్ అయింది. జమునా హెచరీస్ భూములను అసైన్డ్ లబ్దిదారులుగా ఉన్న 56 మంది దళితులకు పంపిణి చేయబోతోంది. హజూర్ నగర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించి తమకు సవాల్ విసిరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కసి తీర్చుకోవడంలో భాగంగానే భూముల పంపిణికి చర్యలు తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలో జమునా హ్యాచరిస్ సంస్థకు భూములు ఉన్నాయి. దళితులకు గతంలో ప్రభుత్వం ఈ భూములను అసైన్డ్ చేసింది. కొన్నేండ్ల క్రితం దళితుల నుంచి ఈ భూములను జమునా హేచరీస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ భూములకు సంబంధించే అక్రమంగా కొనుగోలు చేశారంటూ ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది. ఈ విషయంలోనే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. తర్వాత టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాజేందర్. ఈ భూములపై కలెక్టర్ నుంచి నివేదిక కూడా తెప్పించుకుంది ప్రభుత్వం. జమునా హేచరీస్ కు సంబంధించిన వివాదాస్పద భూములపై విచారణ జరిపిన కలెక్టర్.. ఈటెల జమునారెడ్డికి చెందిన జమునా హెచరీస్ లో సీలింగ్, అసైన్డ్ భూములు ఉన్నట్లు తేల్చారు. రెవిన్యూ అధికారులు చేసిన సర్వే ఆధారంగా 130,81 సర్వే నంబర్లలోని అసైన్జ్ భూమి ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
అచ్చంపేట, హాకీంపేటకు చెందిన 56 మంది రైతుల భూములు కబ్జా కు గురయ్యాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జమునా హెచరీస్ లో షెడ్ల నిర్మాణం చేశారని చెప్పారు. 2018లో ఈ భూములను జమునా హేచరీస్ కు రిజిస్ట్రేషన్ చేశారని కలెక్టర్ తెలిపారు. కొంతమంది రైతులు తమకు పొజిషన్ చూపించాలని కోరడంతో సర్వే చేసి హద్దులు నిర్ణయించామన్నారు. నట్లు తెలిపారు. 56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా చెబుతున్నారు. ఈ భూములపై అసైన్డ్ లబ్దిదారులుగా ఉన్న దళితులను తిరిగి పంపిణి చేయాలని తాజాగా సర్కార్ నిర్ణయించింది. బీజేపీ జాతీయ మహాసభలు హైదరాబాద్ వేదికగా జూలై 2,3 తేదీలలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలంతా రెండు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ తరుణంలో ఈటల రాజేందర్ చేతిలో ఉన్న భూములను పంపిణి చేయడం రాజకీయంగా కాకరేపుతోంది.
Read also: Anti Modi Flexi: హైదరాబాద్ లో కలకలం.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
Read also: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి