Bharathi Raja: బుల్లెట్ సాంగ్ కి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు.. మామూలు ఊపు కాదుగా!

Bharathi Raja: ది వారియర్ సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెంచేసిన ఆ సినిమాలోని బుల్లెట్ సాంగ్ కు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 04:23 PM IST
  • బుల్లెట్ సాంగ్ కి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు
  • జులై 14న విడుదలకు రెడీ అవుతున్న ది వారియర్
Bharathi Raja: బుల్లెట్ సాంగ్ కి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు.. మామూలు ఊపు కాదుగా!

Bharathi Raja Steps to Bullet Song: రామ్ హీరోగా నటిస్తున్న 'ది వారియర్' సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెంచేసింది ఆ సినిమా నుంచి విడుదలైన బుల్లెట్ సాంగ్.  రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ఉప్పెన' భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో అనేక తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో  ప్రస్తుతం యూనిట్ అంతా బిజీ బిజీగా ఉంది. 

ఈ సినిమా నుంచి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బయటకు వచ్చిన రెండు పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. రెండిటిలో ముఖ్యంగా కృతే శెట్టి అద్భుతంగా డాన్స్ చేసిన బుల్లెట్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తమిళ-తెలుగు భాషల్లో కోలీవుడ్ స్టార్‌ శింబు ఆలపించిన ఈ సాంగ్‌ తాజాగా 100 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుని తదుపరి మైలు రాయి దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా ఈ విషయాన్ని షేర్‌ చేసుకుంటూ డైరెక్టర్‌ లింగుస్వామి ఒక ఆసక్తికర వీడియో షేర్ చేశారు.

తన గురువు, తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజాతో కలిసి ఆయన బుల్లెట్‌ పాటకు స్టెప్పులేయడమే కాక ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ అలా స్టెప్పులు వేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు దర్శకత్వానికి దూరమైనా భారతీ రాజా అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. తన శిష్యుడు లింగుస్వామి తెరకెక్కించిన రామ్ ది వారియర్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సాంగ్ సక్సెస్ ను ఆయన కూడా ఎంజాయ్ చేశారు. 

ఇక రామ్ నటిస్తున్న ది వారియర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను సమంత యూ టర్న్ సినిమాను నిర్మించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కెరీర్లో మొట్ట మొదటిసారిగా పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడైన ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా జులై 14న విడుదల కాబోతోంది.  

Also Read : Ravi Teja : షూట్లో ప్రమాదం.. గాయాలపాలైనా వెనక్కి తగ్గని మాస్ మహారాజా..వాటే డెడికేషన్!.

Also Read: Tollywood Releases : ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News