India vs South Africa: ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా ముందు భారీ స్కోర్‌ను ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 76 పరుగులతో ఇషాన్ కిషాన్ అదరగొట్టాడు. 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
గైక్వాడ్ సైతం మూడు సిక్సర్లతో 23 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పాండ్యా సమయోచితంగా ఆడారు. తల ఓ చేయి వేయడంతో భారత్ 200 మార్క్‌ను దాటింది. శ్రేయస్ అయ్యర్ 36, పంత్ 29 పరుగులు చేశారు. చివర్లో హర్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 31 పరుగులు చేశాడు.ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.
𝗜𝗻𝗻𝗶𝗻𝗴𝘀 𝗕𝗿𝗲𝗮𝗸!
A superb batting show by #TeamIndia to post 211/4 on the board. 💪 💪
Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/YOoyTQmu1p #INDvSA | @Paytm pic.twitter.com/Sz0FovFdcU
— BCCI (@BCCI) June 9, 2022
దక్షిణాఫ్రికా బౌలర్లలో పర్వెల్,పెటోరియస్,నోటర్టిజి,మహరాజ్ తలో వికెట్ల తీశారు. భారత ఆటగాళ్ల ధాటికి మహరాజ్ 3 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. రబడ 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చాడు.
Also read:Indian Presidential Election-2022: రాష్ట్రపతి ఎన్నికకు వేళాయే..ఈసారి ప్రత్యేకతలేంటో తెలుసా..?
Also read:IND vs SA1st T20I: భారత్‌దే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే! టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook