Ginger Side Effects: అల్లంతో కూడా దుష్పరిణామాలుంటాయా..ఆశ్చర్యంగా ఉందా. అతిగా తింటే ఏదైనా అనర్ధమే మరి. రోజుకు ఎంత పరిమాణంలో అల్లం తింటే మంచిది. వైద్యులు ఏం చెబుతున్నారు.
భారతదేశంలో ప్రతి వంటింట్లో ఉండేది అల్లం. అల్లంతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలుంటాయి. గొంతు, ఉదరం, జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులకు చెందిన చాలా రుగ్మతలకు అల్లం పరిష్కారం చెబుతుందనేది అనాదిగా పెద్దలు, ఆయుర్వేద వైద్యులు చెప్పే మాట. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. అయితే అల్లంతో దుష్పరిణామాలు కూడా ఉన్నాయంటే నమ్మగలమా..నిజమే మరి. అతిగా తింటే ఏదైనా అనర్దమే కదా. మరి అటువంటప్పుడు అల్లం రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె దడ అధికమౌతుంది. అల్లం ఎక్కువగా తింటే..కంటి చూపు దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య, లో బ్రడ్ ప్రెషర్ కలుగుతాయి. అల్లం పరిమితి దాటి తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలే కాకుండా విరేచనాలు, గర్భస్రావం కూడా తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్థులు అల్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అల్లంం రక్తపీడనానికి కారణమై..అలసట కల్గిస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులు వైద్యుని సలహా మేరకే అల్లం తీసుకుంటే మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా అల్లం వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. అల్లం ఎక్కువగా తింటే గర్భస్రావం ప్రమాదముంది. గుండెల్లో మంట, గ్యాస్ తన్నడం వంటి సమస్యలు ఎదురౌతాయి.
ఇక అల్లం అతిగా తీసుకుంటే కడుపు నొప్పి సంభవిస్తుంది. సహజంగా అల్లం పరగడుపున తీసుకుంటుంటాము. పరగడుపున ఎక్కువ అల్లం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. అల్లం క్రమం తప్పకుండా ఎక్కువగా తీసుకుంటే అది కంటి సంబంధిత సమస్యలకు కారణం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్కిన్, ఐ ఎలర్జీలు ఎదురౌతాయంటున్నారు. కళ్లు ఎర్రబడటం లేదా దురద, పెదవుల్లో వాపు, గొంతులో అసౌకర్యం ఇవన్నీ అల్లం అతిగా తింటే కలిగే దుష్పరిణామాలే. ముఖ్యంగా అల్లం అతిగా తింటే వేడి చేస్తుంది. వేసవిలో ఇది ఏ మాత్రం మంచిది కాదు.
ఒక్కమాటలో చెప్పాలంటే అల్లం తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..పరిమితి దాటితే మాత్రం అన్ని రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
Also read: Heart Attack: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Ginger Side Effects: అల్లం అతిగా తింటే అనర్ధమే, గుండె, కంటి సంబంధిత సమస్యలుంటాయి