Stampede in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి ఇవాళ భక్తులు విపరీతంగా పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా శ్రీవారి భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయింది. రెండు రోజులుగా అలిపిరి రెండో సత్రం వద్ద శ్రీవారి టోకెన్లు నిలిపివేయడం... అప్పటికే అక్కడ వేచి ఉన్న భక్తులకు తోడు ఇవాళ రద్దీ మరింత పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఇది తొక్కిసలాటకు దారితీయడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. కొంతమంది భక్తులు బారికేడ్లను దాటుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh | At least three people were injured in a stampede-like situation at the Tirumala shrine in Tirupati.
A large crowd of pilgrims gathered at the ticket counter in the shrine to secure Sarvadarshan tickets, which led to the stampede-like situation. pic.twitter.com/aXcxGcCqrL
— ANI (@ANI) April 12, 2022
ఓవైపు ఎండ వేడిమి... మరోవైపు తొక్కిసలాటతో క్యూ లైన్‌లో నిలబడిన చాలామంది మహిళలు సొమ్మసిల్లిపోయారు. దాహం దాహం అంటూ మహిళలు, పిల్లలు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. టీటీడీ ఈవో దీనిపై స్పందిస్తూ... వరుస సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారని అన్నారు. ఇంతమంది భక్తులు వస్తారని తాము ఊహించలేదన్నారు.
మరోవైపు, తిరుమలపై నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీ తగ్గేంతవరకూ టోకెన్లు లేకుండానే భక్తులను నేరుగా దర్శనానికి అనుమతించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17 వరకు వీఐపీ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. టీటీడీ తాజా నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేదో ముందే నిర్ణయం తీసుకుని ఉంటే తొక్కిసలాట జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Hyderabad: పారిపోయేందుకు యత్నించిన మూడో తరగతి బాలికలు... కారణమేంటో తెలిస్తే షాక్ అవాల్సిందే...
Also Read: Sunrisers Hyderabad: జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook