Can diabetic patients eat Pomegranate: మధుమేహం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన వ్యాధి. చిన్న వయసులోనే చాలామంది షుగర్ వ్యాధి బారినపడుతున్నారు. మధుమేహం ఉన్నవారికి అథెరోస్క్లెరోసిస్ (Atherosclerosis) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్స్, రక్త ప్రసరణ సమస్యలకు దారితీస్తుంది.
మధుమేహం ఉన్నవారు మూడు నెలల పాటు దానిమ్మ రసాన్ని తీసుకుంటే అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు, అనారోగ్యకరమైన LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ డయాబెటిస్తో పాటు గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. కొన్ని రకాల పండ్ల రసాలు డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదు. అందులో చక్కెర స్థాయిలో అధిక మోతాదులో ఉంటాయి. దానిమ్మ రసంలో చక్కెర యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ నుంచి గుండెను రక్షిస్తుంది.
దానిమ్మ రసం డయాబెటిస్ ద్వారా పొంచి ఉండే ముప్పును తగ్గిస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ ఇది రోగ నిరోధక కణాల ద్వారా ఆక్సీకరణం చెందే చెడు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో దోహదపడుతుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ సూచనలు పాటించే ముందు వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. వైద్యుడి సూచన మేరకే తగిన ఆహారం తీసుకోవాలని షుగర్ పేషెంట్స్ గమనించాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధ్రువీకరించలేదు. కాబట్టి దానిని స్వీకరించే ముందు నిపుణుల సలహాను పొందండి.)
Also read:Viral News: 74 ఏళ్ల ఈ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి ఫిదా అవాల్సిందే... ఆ ఫ్లూయెన్సీ ఎలా వచ్చిందంటే.
SRH vs RR: సంజు శాంసన్ మెరుపు హాఫ్ సెంచరీ... హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook