Corona in AP: ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారి కేసులు భారీగా పెరుగుతుండటం సహా బాధితుల్లో పిల్లలు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళనలు (Corona Updates) పెంచుతోంది.
ముఖ్యంగా స్కూళ్లలో కరోనా కలకలో రేపుతోంది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో స్కూల్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలో తాజాగా నమోదైన కొవిడ్ కేసుల్లో దాదాపు 10 శాతం స్కూల్ విద్యార్థులే ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న ఒక స్కూళ్లో ఇప్పటి వరకు మొత్తం 147 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇందులో 18 విద్యార్థులు (Corona to students) కాగా.. 54 మంది టీచర్లు, నలుగురు ఇతర సిబ్బంది ఉన్నట్లు వెల్లడైంది. అయితే కొవిడ్ బారిన పడిన వారందరిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
స్కూళ్లలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ (Parents coronavirus) చేస్తున్నారు.
అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్లు నడుపుతామని ఇదివరకే స్పష్టం (AP Govt on schools) చేసింది.
రాష్ట్రంలో కరోనా కేసులు ఇలా..
రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా.. రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య 10 వేలపైనే (Daily Corona cases in AP) నమోదవుతోంది. యాక్టివ్ కేసులు 64 వేలపైకి చేరాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే వారం కరోనా పీక్ స్టేజ్‌కు చేరొచ్చని అంచనాలు వస్తున్నాయి.
Also read: AP CM Ys Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హత్య చేస్తానంటూ హెచ్చరిక, నిందితుడి అరెస్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook