Sri Vishnus Arjuna Phalguna Movie Review: రాజ రాజ చోర మూవీ తర్వాత శ్రీవిష్ణు నటించిన సినిమా అర్జున ఫల్గుణ. జోహార్ ఫేమ్ తేజ మర్ని ఈ మూవీని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 31, 2021న రిలీజైంది. కాస్త డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ (Different suspense thriller) స్టోరీతో అర్జున ఫల్గుణ తెరకెక్కింది. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్, (Movie Trailer) పాటలు ఆకట్టుకునేలా ఉండటంతో సినిమా అంచనాలు పెరిగాయి. మరి మూవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం...
గోదావరి జిల్లాలోని ముల్కల్లంక అనే గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతోంది. గ్రామంలో ఉండే ఐదుగురు స్నేహితుల కథ ఇది. అర్జున్‌గా (Arjun) శ్రీవిష్ణు, (Sri Vishnu) శ్రావణిగా అమృతా అయ్యర్, (Amritha Aiyer) రాంబాబుగా రాజ్‌కుమార్, తడ్డోడుగా రంగస్థలం మహేష్, అస్కర్‌గా చైతన్య గరికిపాటి నటించారు.
వీరంతా డిగ్రీ చదివి ఖాళీగా తిరుగుతుంటారు. గ్రామంలోనే ఉండి ఎంతో కొంత ఎర్న్ చేస్తే బెటర్ అనుకుంటారు. అలా ఒక సోడా కంపెనీ (Soda Company) పెట్టాలనుకుంటుంది ఈ బ్యాచ్. అయితే దానికి 4 లక్షల రూపాయల దాకా పెట్టుబడి కావాల్సి వస్తుంది. అంత మనీ వారి దగ్గర ఉండదు. దీంతో పాటు తడ్డోడు కుటుంబానికి బ్యాంక్ అప్పులుంటాయి. అప్పు కట్టాలంటూ బ్యాంక్ నుంచి ఒత్తిళ్లు వస్తుంటాయి. చివరకు అతడి ఇల్లు కూడా జప్తు చేస్తామంటూ బ్యాంక్ నుంచి వార్నింగ్ వస్తుంది.
ఈ క్రమంలో తమ ఎకనామికల్ ప్రాబెమ్స్ నుంచి బయట పడేందుకు అర్జున్ తన మిత్రులతో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. ఈజీగా మనీ ఎలా ఎర్న్ చేసేందుకు.. గంజాయి స్మగ్లింగ్‌కు రెడీ అవుతాడు. దీంతో అర్జున్ గ్యాంగ్ అంతా అనుకోని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఒక్కసారిగా వారందరరీ లైఫ్స్ తలకిందులవుతాయి.
పోలీసులు అర్జున్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను (Arjun Friends Gang) పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ఒక రౌడీ గ్యాంగ్ కూడా వారి కోసం గాలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్‌కు.. అర్జున్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌కు మధ్య ఏం జరిగింది.. వారు సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు.. తడ్డోడు బ్యాంక్ అప్పుకు ఊరి కరణానికి లింక్ ఏంటి.. ఇక అర్జున్, శ్రావణిల ప్రేమకథ ఏమైందనేది సినిమాలో చూడాలి.
ఇక ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఇది వరకు చాలానే వచ్చాయి. అర్జున ఫల్గుణ కూడా అలాంటి కోవకు చెందిన మూవీనే. (Movie) అయితే మూవీ మధ్యలో సాగే కథంతా కూడా చాలా స్లోగా సాగుతుంది. ఫ్రెండ్స్ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బలహీనంగా ఉంటాయి. ఇక పోలీసుల నుంచి అర్జున్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తప్పించుకున్న విధానం సిల్లీగా ఉంటుంది. సినిమా చాలా స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా చాలా వరకు ప్రేక్షకుల ఊహలకు అందే విధంగానే తెరక్కించారు.
Also Read : Stock Market today: 2021కి భారీ లాభాలతో గుడ్‌బై చెప్పిన స్టాక్ మార్కెట్లు..!
అర్జున్ పాత్రలో శ్రీవిష్ణు చక్కగా ఒదిగిపోయి నటించారు. మాస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. శ్రావణి పాత్రలో అమృతా అయ్యర్ అలరిచింది. అర్జున్‌తో శ్రావణి లవ్ ట్రాక్ ఫర్వాలేదు అనేట్లుగా ఉంటుంది. మూవీలో (Movie) గోదావరి (Godavari) అందాలను చక్కగా చూపించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ తేజ.. స్టోరీని కాస్త ఇంట్రెస్టింగ్ తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయ్యాడు. ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్ మ్యూజిక్, (Music) జగదీష్ చీకటి అందించిన ఛాయాగ్రహణం ప్లస్ అయ్యాయి.
Also Read : విమానంలో ప్రయాణిస్తుండగా పాజిటివ్.. టాయిలెట్‌లోనే ఐదు గంటలు! వాష్‌రూమ్‌లో టెస్ట్ ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook