Omicron scare in India: అలాంటి పరిస్థితులే వస్తే రోజుకు 14 లక్షల కరోనా కేసులు!

Omicron scare in India: బ్రిటన్, ఫ్రాన్స్​ దేశాల్లోని కరోనా పరిస్థితులు భారత్​లో ఏర్పడితే పరిస్థితులు దారుణంగా మారుతాయని కొవిడ్ టాస్క్ ఫోర్స్​ ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ కేసులు 14 లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 10:12 AM IST
  • ఒమిక్రాన్ వేరియంట్​పై కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఆందోళన
  • యూరప్​ పరిస్థితులు ఏర్పడితే విధ్వంసమేనని వెల్లడి
  • ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
Omicron scare in India: అలాంటి పరిస్థితులే వస్తే రోజుకు 14 లక్షల కరోనా కేసులు!

Omicron scare in India: ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లోకి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆలస్యంగా కాస్త ప్రవేశించినా.. దేశంలో మాత్రం వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్​ కేసులు (Omicron cases in India) 100 దాటాయి. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నియమించిన కొవిడ్ టాస్క్​ ఫోర్స్ (Covid task force) ఆందోళనకర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్​, ఫ్రాన్స్​లో చూస్తున్న పరిస్థితులు భారత్​కూడా నెలకొంటే.. కేసులు భారీగా పెరుగతాయని తెలిపింది. భారీ జనాభా కారణంగా అలాంటి పరిస్థితులు వస్తే రోజుకు 14 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యే (Corona third wave) ప్రమాదముందని కొవిడ్ టాస్క్​ఫోర్స్ చీఫ్​ వీకే పాల్ హెచ్చరించారు.

ప్రస్తుతం ఫ్రాన్స్​లో సగటున 65 వేల కేసులు (France daily corona cases) నమోదవుతున్నాయి. అలాంటి పరిస్థితులను మన దేశంలో వస్తే రోజుకుగు 13 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదముంని తెలిపారు వీకే పాల్​.

ఇక బ్రిటన్లో రోజువారీ కేసులు ఇటీవల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఒక్క రోజులో అత్యధికంగా 88,042 కేసులు నమోదయ్యాయి. అందులో 2.4 శాతం కేసులు ఒమిక్రాన్​ వేరియంట్​వి కావడం ఆందోళనకరమైన విషయం.
యూరప వ్యాప్తంగా 80 శాత మంది పాక్షికంగా కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) తీసుకున్నారు. అయినప్పటికీ.. డేల్టా వేరియంట్ కేసులు మాత్రం తగ్గటం లేదు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని, న్యూ ఇయర్ వేడుకల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు పాల్​. పార్టీలు, సమూహాలుగా ఏర్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.

ప్రస్తంత దేశంలో కరోనా కేసులు 8 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్​ వేరియంట్ భయాలు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఇతర దేశాల్లో కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు వీకే పాల్​. మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం, టీకాలు వేయించుకోవడం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.

Also read: Covavax: కోవావాక్స్​ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం

Also read: Omicron Cases: భారత్‌లో ఒమిక్రాన్‌ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News