ఎర్రకోట, రాష్ట్రపతిభనన్ ను కూల్చేయాలన్న అజాంఖాన్

Last Updated : Oct 18, 2017, 01:30 PM IST
ఎర్రకోట, రాష్ట్రపతిభనన్ ను కూల్చేయాలన్న అజాంఖాన్

సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహాల్ యూపీ పర్యాటక గైడ్ నుంచి తొలిగించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ..తాజ్ మహాల్ చారిత్రక కట్టడం కాదంటే.. రాష్ట్రపతి, పార్లమెంట్, ఎర్రకోట కూడా కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లలో చెప్పాలంటే ... ‘ఒకప్పుడు మనల్ని పాలించిన వాళ్లని గుర్తు చేస్తూ ఉండే చారిత్రాత్మక కట్టడాలను ధ్వంసం చేయాలి. పార్లమెంట్‌, కుతుబ్‌ మినార్‌, రాష్ట్రపతి భవన్‌, ఎర్రకోట, ఆగ్రాలోని తాజ్‌మహల్‌.. అన్నింటినీ నాశనం చేయాలి.’ అని యూపీ మాజీ మంత్రి అజాంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 
యూపీ పర్యాటక గైడులో నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ నిన్న యూపీ భాజపా శాసనసభ్యుడు సంగీత్‌ సోమ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘తాజ్‌మహల్‌ చరిత్ర ఏమిటి? తండ్రిని జైలులో పెట్టిన ఓ చక్రవర్తి దాన్ని నిర్మించడం ఓ చరిత్రేనా? హిందువులే లక్ష్యంగా దాడులు చేసిన వ్యక్తి నిర్మించిన దాన్ని చరిత్ర అంటామా?’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అజాంఖాన్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌, రాష్ట్రపతి భవన్‌ కూడా బానిసత్వానికి ప్రతీకలుగా చూడాల్సి వస్తుందని.. తాజ్ మహాల్ తో పాటు వాటి కూడా కూల్చేద్దామా అని వ్యాఖ్యానించారు.

Trending News