/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

B.Tech Student Suicide: తొందరపాటు నిర్ణయాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కోరుకున్న సీటు రాలేదనో, ఉద్యోగం దొరకలేదనో...క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. తాజాగా ఎంటెక్(M.Tech)లో సీటు రాలేదని ఓ విద్యార్థి  ప్రాణాలు(Student Suicide) తీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా(Karimnagar District)లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...
జిల్లా కేంద్రంలోని ఆశోక్ నగర్​కు చెందిన షఫీ బీటెక్ పూర్తి చేశాడు. ఎంటెక్ ప్రవేశ పరీక్ష రాసినా కూడా సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురై బలవన్మరణాని(Suicide)కి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: అపార్టుమెంట్​లో చెలరేగిన మంటలు..పొగలు చుట్టుముట్టి వ్యక్తి దుర్మరణం

మృతుడు విట్స్ కళాశాలలో బీటెక్(B.Tech) పూర్తి చేశాడు. ఎంటెక్ లో ప్రవేశానికి ఎంట్రైన్స్ పరీక్ష రాశాడు.  అయితే ఎంటెక్ సీటు రాకపోవడం.. మరోవైపు ఉద్యోగం దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయాడు.  ఇంటి నుంచి బయటికి వెళ్తున్నానని అమ్మతో చెప్పి దిగువ మానేరు డ్యామ్(Lower Manor Dam) కాకతీయ కెనాల్ వద్దకు బైక్ పై వెళ్లాడు. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్‌ చేసి బైక్ డ్యామ్ కెనాల్ వద్ద ఉందని.. వచ్చి తీసుకుని వెళ్లాలని మేసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల(Police)కు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో వెతికించగా.. షఫీ మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Section: 
English Title: 
B.Tech Student Suicide at Kakatiya canal in Karimnagar District
News Source: 
Home Title: 

ఎంటెక్​లో సీటు రాలేదని విద్యార్థి బలవన్మరణం

కాల్వలోకి దూకి విద్యార్థి ఆత్మహత్య..ఎంటెక్​లో సీటు రాకపోవడమే కారణం...
Caption: 
File photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కాల్వలోకి దూకి విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో ఘటన

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Mobile Title: 
ఎంటెక్​లో సీటు రాలేదని విద్యార్థి బలవన్మరణం
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, November 18, 2021 - 08:35
Request Count: 
61
Is Breaking News: 
No