Jai Bhim-Raghava Lawrence: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన '‘జై భీమ్' చిత్రం గురించే చర్చ జరుగుతోంది. హీరో సూర్య(Hero Surya) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా(jai bhim Movie)కు విశేష ఆదరణ లభిస్తోంది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. కులతత్వం, పోలీసుల క్రూరత్వం, సమాజంలో మానవ హక్కులు ఏ విధంగా హరించివేయబడుతున్నాయనే అంశం నేపథ్యంలో సాగుతోంది ఈ మూవీ. తాజాగా ఈ చిత్రంపై ప్రశంసలు జల్లు కురిపించాడు నటుడు, దర్శకుడు, డ్యాన్సర్ లారెన్స్(Raghava Lawrence). ఈ సినిమాను తెరక్కెక్కించిన దర్శకుడు జ్ఞానవేల్, నిర్మాతలు సూర్య – జ్యోతిక, చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Also Read: Jai Bhim controversy: కమ్యునల్ సింబల్ విషయంలో 'జై భీమ్'పై మరో వివాదం
28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవిక ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా '‘జై భీమ్'(jai bhim). ఇటీవల విడుదలై అందర్నీ ఆలోచింపజేస్తోంది. బాధితురాలు పార్వతమ్మ(Parvathi) సాహసాన్ని ఇప్పుడు పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించి లారెన్స్ స్పందిస్తూ...‘‘''పార్వతమ్మ పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయా. దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన్ను మనసారా అభినందిస్తున్నా. పార్వతమ్మకు తప్పకుండా మంచి ఇంటిని నిర్మించి ఇస్తా''నని ఆయన అన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫ్రంట్ లైన్ కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు లారెన్స్ ఎంతగానో సాయం చేశారు. ఏకంగా రూ. 5 కోట్లకు పైగా విరాళం అందజేశారు.
A house for Rajakannu’s family 🙏🏼 #JaiBhim #Suriya @Suriya_offl @2D_ENTPVTLTD @rajsekarpandian @tjgnan @jbismi14 @valaipechu pic.twitter.com/nJRWHMPeJo
— Raghava Lawrence (@offl_Lawrence) November 8, 2021
స్టోరీ ఏంటంటే..
‘'జై భీమ్'’ సినిమాలో గిరిజన గర్భిణీ మహిళ భర్త రాజకన్నును పోలీసులు తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయడమే కాకుండా లాకప్‌లో కొట్టి చంపేస్తారు. దాంతో తనకు న్యాయం కోసం పోరాడుతుంది ఆ మహిళ. నిజ జీవితంలో తమిళనాడు(Tamilnadu)లోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాసకన్న విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. నిజ జీవితంలో జరిగిన అంశాలనే సినిమా కథగా ఎంపిక చేసుకున్న సినీ దర్శకుడు జ్ఞానవేల్(Director Gnanavel).. '‘జై భీమ్'’ పేరుతో సినిమాను తీశారు.
Also Read: Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook