Covid-19 vaccination: మ‌హారాష్ట్ర‌లో 18 వ‌ర‌కు వ్యాక్సినేషన్‌కు బ్రేక్

క‌రోనావైరస్‌ను అంతం చేసేందుకు శ‌నివారం దేశ‌వ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు 3లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1.91లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2021, 06:30 AM IST
Covid-19 vaccination: మ‌హారాష్ట్ర‌లో 18 వ‌ర‌కు వ్యాక్సినేషన్‌కు బ్రేక్

COVID-19 vaccination temporarily suspended in Maharashtra | ముంబై: క‌రోనావైరస్‌ను అంతం చేసేందుకు శ‌నివారం దేశ‌వ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు 3లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1.91లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగారు. అయితే ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు మహారాష్ట్రలో బ్రేక్ పడింది. కోవిన్ యాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా 18వ తేదీ వ‌ర‌కు వ్యాక్సినేషన్ (COVID-19 vaccination) ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. 

క‌రోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ (CoWIN App)‌లో డిజిటల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ యాప్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు విఘాతం కలిగిందని.. దీని ప‌రిష్కారం కోసం ఆదివారం, సోమవారం రెండురోజులపాటు నిలిపివేస్తున్నట్లు మ‌హారాష్ట్ర అధికారులు ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర‌ (Maharashtra) లో 285 కేంద్రాల్లో తొలి రోజు 28,500 మందికి టీకా వేయాల‌ని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 18,425 మందికి మాత్ర‌మే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యినట్లు వెల్లడించారు. Also Read: COVID-19 Vaccination: వ్యాక్సినేష‌న్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

తొలిరోజు 65 శాతం మంది ఆరోగ్య కార్య‌కర్త‌లకు మాత్ర‌మే టీకాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఇమ్యూనైజేష‌న్ అధికారి డాక్ట‌ర్ దిలీప్ పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని హింగోలి జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వగా.. ధూలే, షోలాపూర్‌, బీడ్‌, ప‌ర్బానీ, బుల్ధానా జిల్లాల్లో 90 శాతానికి పైగా (Coronavirus) వ్యాక్సినేస‌న్ పూర్త‌యినట్లు దిలీప్ పాటిల్ తెలిపారు. కోవిన్ యాప్ సమస్య పరిష్కారం కాగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News