Kamal Haasan says Govt should listen to the farmers demands: చెన్నై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు (Delhi Chalo) ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan ) స్పందించారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) రైతులు డిమాండ్లను వినాలని కమల్ హాసన్ సూచించారు. వారి డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు కమల్ హాసన్ మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.
The Government should listen to the demands of the farmers: Kamal Haasan, President, Makkal Needhi Maiam in #Chennai pic.twitter.com/trXVrTxBVR
— ANI (@ANI) December 1, 2020
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో సీఎం పరిపాలన పట్ల సంతృప్తి లేదని పేర్కొన్నారు. నివర్ తుఫాన్ బాధితులకు సహాయం చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. Also read: Delhi Chalo: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో సమావేశం
ఈ సమావేశంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ బాబు మక్కల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన్ను కమల్ మక్కల్ నీధి మయం పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read | GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Kamal Haasan: రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం (Central Govt) రైతులు డిమాండ్లను వినాలని కమల్ హాసన్ సూచించారు.