ఉద్యోగం చేస్తున్న వారికి శుభవార్త. కేవలం ఒక్క సంవత్సరం ఉద్యోగం చేసినా వారికి గ్రాట్యూటీ (Gratuity ) ప్రయోజనాలు కలుగుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లో ( Social Security Code 2020 ) ఉద్యోగులకు లాభాలు కలిగించేలా ఎన్నో మార్పులు, అవకాశాలు కల్పించారు. కొత్త రెగ్యులేషన్స్ ప్రకారంయ ఇంకమ్ గ్రాట్యూటీ కాలాన్ని ( Income Gratuity Period ) 5 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరానికి మార్చారు.
ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం
పార్లమెంట్ ( Parliament ) వర్షాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో పలు మార్పులు చేస్తూ లోక్ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఇందులో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 కూడా ఉంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ లో ఎన్నో అంశాలను చేర్చారు. అందులో ఒకటి గ్రాట్యుటీకి సంబంధించినది. దీని ప్రకారం గ్రాట్యూటీని పొందడానికి ఇకపై 5 సంవత్సరాలు అవసరం లేదు.. ఒక సంవత్సరం కూడా సరిపోతుంది.
ALSO READ| WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే
వేతనంతో పాటు గ్రాట్యూటీ
కొత్త విధానం ప్రకారం సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 వల్ల ప్రైవేటు రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా లాభాలు కలుగుతాయి. పైన తెలిపిన కాలంలో పని చేసిన ప్రైవేటు రంగ ఉద్యోగులకు కూడా గ్రాట్యూటీ ఫలితాలు దక్కుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏడాది పాటు కాంట్రాక్ట్ పై పనిచేసే వారికి కూడా గ్రాట్యూటీ అనేది వారి వేతనంతో పాటు లభిస్తుంది. అంటే కాంట్రాక్ట్ ఎంత కాలం అని కాకుండా గ్రాట్యూటీని చెల్లించాల్సిందే.
ఈ బిల్లు చట్టం అయితే కలిగే లాభాలు ఇవే
సోషల్ సెక్యూరిటీ ( The Social Security Code 2020 ) బిల్లు అనేది ఇంకా ఉభయ సభల్లో ఇంకా ఆమోదం పొందలేదు. ఉభయ సభల ( The Two Houses Of Parliament ) ఆమోదం తరువాతే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇతర వివరాలు అప్పుడే తెలుస్తాయి. బిల్లు చట్టంగా మారితే వర్తించే షరతులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ALSO READ| Money Making: ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే 5 మార్గాలు
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR