AP SSC Exams 2020 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి మొగ్గు చూపుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన గుర్తుచేశారు. కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో పరీక్షల పేరిట విద్యార్థుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టటం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. ( Also read : Telangana exams: డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ )
ఆంధ్రప్రదేశ్‌కి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. కరోనా ప్రభావంతో డిగ్రీ, పి.జి., ఉన్నతమైన వృత్తి సంబంధిత పరీక్షలతో పాటు, ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు సైతం రద్దయిపోయాయని పవన్ గుర్తుచేశారు. అంతేకాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో కరోనావైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున అక్కడి విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టేలా పరీక్షలు నిర్వహించడానికి ససేమిరా ఒప్పుకోం అంటూ తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చిందనే విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ ఇక్కడ గుర్తుచేశారు. ( Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
ఓవైపు ఏపీలో పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని కోరుతూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించి ప్రకటన విడుదల చేసిన రోజే పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..