mamata Banerjee shocking comments on rg kar case verdict: ఆర్జీకర్ ఆస్పత్రిలో గతేడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలి సెమినార్ హల్ లో అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై జూనియర్ డాక్టర్లు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా.. దీనిపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆర్జీకర్ ఘటనపై తాజాగా.. కోల్ కతాలోని సీల్దా న్యాయస్థానం నిందితుడు సంజయ్ రాయ్ కు జీవితఖైదు పనిష్మెంట్ ను ఖరారు చేసింది.
అంతే కాకుండా.. బాధితురాలి కుటుంబానికి వెస్ట్ బెంగాల్ సర్కారు.. 17 లక్షల రూపాయల్ని పరిహారంగా ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈ తీర్పుపై చాలా మంది స్వాగతించట్లేదు. జూనియర్ వైద్యురాలిని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తిని ఇలా జీవిత ఖైదు విధిస్తే న్యాయవ్యవస్థ మీద ప్రజలకు ఎంత వరకు నమ్మకం ఉంటుందని కూడా అనేక మంది వాదిస్తున్నారు.
దీనిపై తాజాగా.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం స్పందించారు. ఆర్జీకర్ కేసులో... నిందితుడికి కోర్టు మరణశిక్ష ఎందుకు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ కేసును సిబిఐకు బదులుగా రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి ఉంటే, నిందితుడికి మరణశిక్ష విధించేవారని ఆమె చెప్పుకొచ్చారు.
ముర్షిదాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. తమ సర్కారు.. మొదటి నుండి నిందితుడికి మరణశిక్ష మాత్రమే సరైన పనిష్మెంట్ అని వాదిస్తున్నామన్నారు. ఈ కేసు రాష్ట్ర పోలీసుల చేతుల్లో ఉంటే, న్యాయవ్యవస్థకు తగిన తీర్పు వచ్చేదన్నారు. కానీ సీబీఐ వల్లే.. ఈ రోజు నిందితుడికి జీవిత ఖైదు పడిందన్నారు.
Read more: Kolkata Murder Case: కోల్ కతా ఘటనలో మరో సంచలనం.. సంజయ్ రాయ్‌కి జీవిత ఖైదు విధించిన కోర్టు..
అందుకే ప్రజల్లో.. సీబీఐ దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె స్పష్టంచేశారు. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన అనేక కేసుల్లో మరణశిక్షలు అమలయ్యాయి. ఈ కేసు తీర్పుపై నాకు సంతృప్తి లేదని దీదీ మరోసారి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ కేసు అరుదైన కేసుల జాబితాలోకి రాదని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter