NEET UG 2025 Update: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్ష మరోసారి పెన్ పేపర్ విధానంలో జరగనుందని తేలిపోయింది. ఇక త్వరలో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మీరు కూడా నీట్ పరీక్షకు సిద్ధమౌతుంటే తక్షణం ఈ పని పూర్తి చేయాలని ఎన్టీఏ సూచిస్తోంది. అదేంటో తెలుసుకుందాం.
నీట్ యూజీ 2025 పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్య సూచన. త్వరలో నీట్ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది. అంతకంటే ముందు నీట్ విద్యార్ధులు కీలకమైన పని పూర్తి చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. నీట్ యూజీ 2025తో అపార్ ఐడీ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమక్ ఎక్కౌంట్ రిజిస్ట్రీ అనుసంధానం కోసం విద్యార్ధులు తమ తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ యూజీ 2025 విద్యార్ధుల ఆధార్ కార్డు అప్‌డేట్ అయితే.వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం కానుంది. ఎందుకంటే నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విద్యార్ధులు ఆధార్‌లో తమ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి. పదో తరగతి సర్టిఫికేట్ ఆధారంగా, ఫేసియల్ రికగ్నిషన్ డేటా అప్‌డేట్ ఉంటే మంచిది. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌తో ఓటీపీ ధృవీకరణ కూడా పూర్తయి ఉండాలి.
ఆధార్ అప్‌డేట్ అయుంటే దరఖాస్తు ప్రక్రియలో తప్పులకు అవకాశం తక్కువగా ఉంటుంది. యూఐడీఏఐ ప్రవేశపెట్టిన ఫేస్ అథెంటిఫికేషన్ ప్రక్రియతో వెరిఫికేషన్ మరింత ఈజీ అవుతుందని ఎన్టీఏ తెలిపింది. అందుకే నీట్ రాసే విద్యార్ధులు తక్షణం తమ ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకుంటే మంచిది.
Also read: NEET UG 2025: నీట్ యూజీ 2025 పరీక్ష ఆన్‌లైన్‌కు ప్రభుత్వం ఎందుకు నో చెప్పింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి