RAJINI VIDADALA: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టే తెలుస్తోంది. మాజీ మంత్రి విడదల రజనీ చిలకలూరి పేటలో పొలిటికల్‌గా మళ్లీ యాక్టివ్ కావడాన్ని సొంత పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం. ఇన్నాళ్లు ఇద్దరి మధ్య ఉప్పునిప్పులా ఉన్న విభేదాలు.. విడదల రజినీ గుంటూరు వెస్ట్‌కు మారక కాస్తా చల్లబడ్డాయి. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక రజినీ తిరిగి చిలకలూరిపేటలో రావడంతో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారబోతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక వైసీపీ ప్రభుత్వంలో విడదల రజనీ వైద్యారోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. ఆమెకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రిగా అవకాశమిచ్చారు.. పార్టీలో, మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడదల రజిని చాలా జూనియర్. అయినప్పటికీ- ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన విడదల రజనీ ఈసారి ప్లేస్ మారారు. ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. కూటమి అభ్యర్ధి గల్లా మాధవి చేతిలో 51 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇటీవల తిరిగి రజినిని చిలకలూరి పేట వైసీపీ ఇంచార్జ్‌గా జగన్ నియమించారు. ఇప్పుడు ఇదే విషయంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు ఇబ్బందిగా మారింది.
చిలకలూరిపేటలో ఫ్యాన్ పార్టీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నేతగా కొనసాగుతున్నారు. 2004లో ఇండిపెండెంట్‌గా గెలిచిన మర్రి రాజశేఖర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తదనంతరం వైఎస్ జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్‌కి మంచి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో విడదల రజినీకి జగన్ టికెట్ ఇచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభంజనం, బీసీ కార్డుతో రజిని గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజిని మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్‌కు పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివ నాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు..
ప్రస్తుతం చిలకలూరిపేటకు రజినీ రీ ఎంట్రీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు ఇబ్బందిగా మారిందట. ఆయన చిలకలూరి పేట ఎమ్మెల్యే సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరి పేట నుంచి మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ రజినీ రీ ఎంట్రీతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన మిత్రుడు నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవ రాయులుతో మర్రి రాజశేఖర్ ఓ దఫా చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయం అని చిలకలూరిపేటలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలో విడదల రజినీ పోరు తట్టుకోలేక.. పార్టీ మారాలని అనుకుంటున్న మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో ప్రతిపాటి పుల్లారావును ఎలా డీల్ చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎండ్ విత్ స్పాట్..
Also Read: CHIRANJEEVI: బీజేపీలోకి మెగాస్టార్? ఇచ్చే పోస్టు ఇదే!
Also Read: ఆధార్ ఉంటే ఇంటి స్థలం ఫ్రీ!..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.