హైదరాబాద్: కరోనా వ్యాప్తి ప్రభావంతో ఇప్పటికే సినీ పరిశ్రమ, ఇతర మెగా మాల్స్, బహుళ సమూదాయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చి 27న తన 35వ పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో మెగా అభిమానులు భారీ ఎత్తున రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను జరిపేందుకు సిద్ధమయ్యారు. కాగా మార్చి 26న నగరంలోని రవీంద్ర భారతిలో చాలా బ్రహ్మాండంగా మెగా పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకను నిర్వహించాలని అభిమానులు భావించారు.
Megapower Star Ram Charan requests his fans to avoid public gatherings and cancellation of his birthday celebrations. He requests his fans to spread awareness about ways to avoid spread of #Covid19 Virus. pic.twitter.com/KpeIh6pdhT
— BARaju (@baraju_SuperHit) March 18, 2020
Read Also: మేం జోక్యం చేసుకోలేం.. తేల్చిచెప్పిన సుప్రీం కోర్ట్..
ఈ దశలో హైదరాబాద్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని అభిమానులకు సూచించాడు. జన సమూహాలు ఎక్కువుండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంటుందని, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి వేడుకలను, ఇతర కార్యక్రమాలను నిర్వహించొద్దని రామ్ చరణ్ తన అభిమానులను ట్వీట్టర్ ద్వారా కోరాడు.
Also Read: కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ఊరట
అయితే రామ్ చరణ్ స్పందిస్తూ.. ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను జరపకపోవడమే తనకు మీరిచ్చే పెద్ద బహుమతి అని చరణ్ పేర్కొన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు అభిమానులందరూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రభుత్వానికి సహకరించాలని చరణ్ పేర్కొన్నాడు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.