K Kavitha: రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్‌లోనే.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

Revanth Reddy Roots In RSS Says BRS Party MLC K Kavitha: ఆర్ఎస్ఎస్ మూలాలు రేవంత్ రెడ్డిలో ఉండడంతోనే మైనార్టీలకు ద్రోహం .. మోసం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్‌ ఇతోధికంగా కృషి చేశారని గుర్తుచేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 12, 2025, 08:09 PM IST
K Kavitha: రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్‌లోనే.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మైనారిటీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారని ఆరోపించారు. 'గాంధీల కుటుంబాన్ని చూసి మైనారిటీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు మైనారిటీల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేస్తోంది ' అని విమర్శలు చేశారు. నిజమాబాద్‌ జిల్లాలో పర్యటించిన కె కవిత రాష్ట్ర పరిణామాలు, రేవంత్‌ రెడ్డి మోసాలు.. వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

Also Read: Danam Nagender: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. తిరుగుబాటు మొదలైందా?

'కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మతకల్లోలాలు జరిగాయి' అని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. మతకల్లోలాలను నిరోధించడానికి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు‌. గంగాజమునా తెహజీబ్ లా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని తెలిపారు.

Also Read: Revanth Reddy: అమరావతిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'

మైనారిటీ డిక్లరేషన్ అమలు ఏమైందని కవిత ప్రశ్నించారు‌ మైనారిటీ డిక్లరేషన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 'మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్ లో కనీసం 25 శాతం కూడా ఖర్చు చేయలేదు. రూ.3 వేల కోట్లు కేటాయించి కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు' అని కవిత ఆరోపించారు. షాదీ ముబారక్ కింద రూ.1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి ఎగ్గొట్టాడని మండిపడ్డారు. నిజామాబాద్ లో తబ్లిఖీ జమాత్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయాలి. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని కవిత గుర్తు చేశాడు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News