Formula E Car Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ACB తన దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఏ2గా అప్పటి మున్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ను ఈ రోజు ఏసీబీ విచారించనుంది. అలాగే ఇదే కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి కూడా ఇవాళే ఈడీ (Enforcement directorate) ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు అనుమతిచ్చేయడంతో భారత రాష్ట్ర సమితి (BRS)నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఈ నెల 9న ఏసీబీ, ఆ తర్వాత వారానికి 16న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ ఫార్ములా– ఈ రేస్ కేసు ఉచ్చు బిగుసుకుంటుందన్న చర్చ జరుగుతున్నది. మరో వైపు కేసును కొట్టేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు కేటీఆర్ అరెస్ట్ కాకుండా రిలీఫ్ ఇస్తుందా.. విచారణ కు చేసుకోమని అనుమతులు ఇస్తుందా అనేది చూడాలి.
ఫార్ములా ఈ కారు కేసులో క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసిన తర్వాత మాజీ మంత్రి కమ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తన నోరును ఎవరూ మూయించలేరు అని ట్వీట్ చేసారు. ఈ ఎదురుదెబ్బల నుంచి గోడకు కొట్టిన బంతిలా తిరిగి పైకి లేస్తామని తెలిపారు. ఈ అబద్ధాలు తనను ఏమి చేయలేవు అన్నారు. వరుస కేసులు ఉన్న రేవంత్ రెడ్డి వైఫల్యాలపై ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. అంతేకాదు ఓటు నోటుకు కేసులో అడ్డంగా దొరికిన వాడు.. ఈ రోజు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఇలాంటి తాటాకు చప్పళ్లకు బెదరమన్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.