Pushpa2 movie: మరల వివాదంలో పుష్ప2 మూవీ.. బిడ్డా.. ఇంటి కొచ్చి కోడతమంటూ పుష్ప టీమ్ కు మాస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?

Allu arjun: పుష్ప 2 మూవీ మరల వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలయ్యాక.. ఒకవైపు రికార్డుల మోత మోగిస్తునే మరోవైపు కాంట్రవర్షీకు కేరాఫ్ గా కూడా మారిందని చెప్పుకొవచ్చు.   

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2024, 10:19 AM IST
  • ఫైర్ అవుతున్న కర్ణిసేన..
  • పుష్ప మూవీ టీమ్ కు ధమ్కీ..
Pushpa2 movie: మరల వివాదంలో పుష్ప2 మూవీ.. బిడ్డా.. ఇంటి కొచ్చి కోడతమంటూ పుష్ప టీమ్ కు మాస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?

Karnisena warning to puphpa2 team: పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక రికార్డులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డిసెంబరు 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మూడేళ్ల నుంచి ఈమూవీ కోసం టీమ్ ఎంతో కష్టపడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీకి సుకుమార్, అల్లు అర్జున్, రష్మీక మందన్న, టీమ్ కూడా ఎంత డేడికెట్ గా తమ మేజర్ టైమ్ ను ఈ మూవీపై పెట్టినట్లు తెలుస్తొంది.

అయితే.. పుష్ప టీమ్ ఎంతైతే కష్టపడ్డారో.. అదే విధంగ రిజల్ట్ వచ్చిందని చెప్పుకొవచ్చు. ఈ మూవీలోని ఒక్కొసీన్, ఒక్కొసాంగ్ , మాస్ డైలాగ్స్, ముఖ్యంగా తిరుపతి గంగమ్మ జాతర, అల్లు అర్జున్ ఎలివేషన్స్ ఈ సినిమాకు హైలేట్ గా నిలిచాయని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప2 మూవీ మాత్రం విడుదలైన నాలుగో రోజు.. 800 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తొంది. దీన్నిబట్టి చూస్తే.. ఈ మూవీ వారంరోజుల్లోనే వెయ్యి కోట్ల సినిమా క్లబ్ లో చేరిపోతుందనడంలో ఏ మాత్రం డౌట్ లేదని చెప్పుకొవచ్చు.

ఈ క్రమంలో పుష్ప 2 మూవీ మరొవైపు కాంట్రవర్సీకలు కేరాఫ్ గా కూడా మారింది. హైదరబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక ఫ్యామిలీలో... రేవతి అనే మహిళ చనిపోగా..ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ఇంకా ఆస్పత్రిలో చికిత్స  తీసుకుంటున్నాడు. అయితే.. దీనిపై పోలీసులు కేసుల్ని సైతం నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇటీవల ఈ ఘటన పట్ల సారీ కూడా చెప్పారు.

ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పారు. తమ తరుపున 25 లకలు ఇచ్చేందుకు సైతం ముందుకొచ్చారు. ఇదికూడా కాంట్రవర్సీగా మారిందని చెప్పుకొవచ్చు . కేసులను మాఫీ చేసుకునేందుకు 25 లక్షల అంటూ కొందరు ట్రోల్స్ చేశారు. నువ్వు మాత్రం.. కోట్లలో రెమ్యునరేష్ తీసుకుంటూ.. బాధిత కుటుంబానికి మాత్రం.. కేవలం 25 లక్షల .. అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మరో వివాదం వార్తలలో నిలిచింది.

ఈ మూవీలో విలన్ అయిన.. ఫహద్ ఫాజిల్.. పేరు బన్వార్ సింగ్ షేకావత్.. అంటే..దీనిలో ఒక విలన్ మాదిరిగా చూపెట్టినట్లు తెలుస్తొంది. అయితే.. షేకావత్ అనేది రాజస్థాన్ లో ఒక కత్రియులను అక్కడ షేకావత్ అని ఉంటారంట. అయితే. ఈ మూవీలో..తమను విలన్ లుగా.. ఆపేరు వచ్చేలా సంభోదించారని కూడా వారు తీవ్రంగా మండిపడ్డారు.

Read more: Manchu Manoj VS Mohan babu: పవన్, రేవంత్ సార్... నాకు న్యాయం చేయండి.. మంచు మనోజ్ స్పెషల్ రిక్వెస్ట్..

వెంటనే షేకావత్ పేరును ఈ మూవీలో నుంచి తొలగించాలని కూడా... పుష్ప2 నిర్మాతకు, టీమ్ కు మాస్ వార్నింగ్ ఇస్తు కర్ణిసేన నేతలు ఒక వీడియో సైతం రిలీజ్ చేసినట్లు తెలుస్తొంది. వెంటనే ఈ పేరును తొలగించకుంటే.. మాత్రం.. ఇంటికి వచ్చిమరీ కొడతామంటూ కూడా వారు మాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పుష్ప2 మూవీ మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News