Manchu mohan babu and Manchu manoj controversy: మంచు మోహన్ బాబు, మనోజ్ ల మధ్య గోడవలు పీక్స్ కు వెళ్లినట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఈ ఘటన ఒకవైపు ఇండస్ట్రీలోను.. మరొవైపు రాజకీయాల్లోను కూడా తీవ్ర చర్చనీయాశంగా మారినట్లు తెలుస్తొంది. అయితే.. మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. తాజాగా, మంచు మనోజ్... ఎక్స్ వేదికగా.. తెలంగాణ , ఏపీ సీఎంలు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవోలకు ప్రత్యేకంగా ట్యాగ్ చేశారు.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024
ఈ విషయంలో కల్గజేసుకుని న్యాయం చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. ఆదివారం నుంచి మంచు వారి ఇంట మంటలు రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకొవచ్చు. ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా మంచు వారి ఇంట రచ్చ అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంతలో గొడవలు ఏంలేవని .. మోహన్ బాబు టీమ్ నుంచి ఒక నోట్ విడుదల చేశారు.
కానీ మనోజ్ మాత్రం తనపై దాడిజరిగిందని, కొందరు దాడిచేశారని, ఆస్పత్రికి వెళ్లడం పెనుదుమారంగా మారింది. అంతే కాకుండా.. గొడవల్లో గాయమైనట్లు కూడా.. డాక్టర్ల రిపోర్ట్ సైతం బైటికొచ్చింది. ఈ క్రమంలో మంచు మనోజ్ నిన్న.. పహాడీ షరీఫ్ పీఎస్ లో...తనపై, తన భార్యపై కొంత మంది దాడులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే.. మోహన్ బాబు.. ఏకంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖను రాశారు.
తనకొడుకు తనపై, దాడికి ప్రయత్నించాడని, కోడలు కూడా కొంత మంది అసాంఘిక శక్తులతో కలిసి దాడులకు ప్లాన్ లు చేస్తున్నారని ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తొంది. జల్ పల్లిలో ఉన్న తన నివాసంలో.. కొన్నిరోజులుగా మనోజ్ ఉన్నాడని, ఆతర్వాత వెళ్లిపోయి.. కొంత మంది ప్రొద్బలంతో.. మరల గొడవలు చేస్తున్నాడని అన్నారు. తాను.. సీనియర్ సిటీజన్ అని..దయచేసి తగిన సెక్యురిటీ ఇవ్వాలని పోలీసుల్ని కోరాడు.
దీంతో ప్రస్తుతం మంచు మోహన్, మంచు విష్ణుల మధ్య గొడవలు రెండు స్టేట్స్ లలో కాకరేపుతుందని చెప్పుకొవచ్చు. అదే సమయంలో ఒక వైపు మంచు మోహన్, మరొవైపు మంచు మనోజ్ సైతం.. పదుల సంఖ్యలు బౌన్సర్ లను తమ సెఫ్టీ కోసం నియమించుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల వైపు నుంచి ఫిర్యాదులుతీసుకున్నారు. అయితే.. తాజాగా.. మంచు మోహన్ ఫిర్యాదు మేరకు.. పోలీసులు.. మంచు మనోజ్, ఆయన భార్య మౌనికలపై కేసునమోదు చేసినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.