Viral Video: మరో వివాదంలో నాగార్జున..?.. గుడిలో ఇదేం పనంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..

Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనంచేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2024, 08:01 AM IST
  • నాగార్జునను ట్రోల్స్ చేస్తున్న నెటిజన్ లు..
  • కౌంటర్ ఇస్తున్న అక్కినేని అభిమానులు..
Viral Video: మరో వివాదంలో నాగార్జున..?.. గుడిలో ఇదేం పనంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..

sobhita nagachaitanya wedding srisailam trip goes controversy: శోభిత, చైతుల పెళ్లి ఎట్టకేలకు డిసెంబరు 4న జరిగింది. వీరి ఎంగెజ్ మెంట్ జరిగినప్పటి నుంచి రోజుకో పుకార్లు, రోజుకో రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేశారు. వీరు విడిపోతారని, అసలు వీరి పెళ్లి జరగదని, నాగార్జున వీరి ఎంగెజ్ మెంట్ క్యాన్షిల్ చేసుకొవాలని చూస్తున్నారని రకరకాలుగా సోషల్ మీడియాలో కాకులై కూశారు. కానీ అన్నింటికి చెక్ పెడుతూ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా.. సంప్రదాయ బద్దంగా.. వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది.

కొత్త జంట ఎంతో చూడముచ్చటగా కన్పిస్తున్నారని అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు  శోభిత, చైతులపెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక ఇమేజేస్ నెట్టింట వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజన్లు వీరిపెళ్లి ఫోటోల్ని చూసి ఫిదా అయినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా..పెళ్లి తర్వాత నాగార్జున తన కోడుకు అక్కినేని నాగచైతన్య, కోడలు శోభితను తీసుకుని శ్రీ శైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు .

 

అయితే.. ఆలయ పూజారులు,సిబ్బంది  నాగార్జున కుటుంబానికి స్పెషల్ గా వెల్ కల్ చెప్పారు. ఇదిలా ఉండగా.. వీరు గుడిలోకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహించారు. అయితే.. ఇక్కడే నాగార్జున చేసిన ఒక పని ప్రస్తుతం వివాదానికి కారణంగా మారింది. చైతు భార్య.. పూజారీ చేతిలో ఉన్న ప్లేటులోకి కుంకుమపెట్టుకునేందుకు ప్రయత్నించింది. అప్పుడు.. చైతు.. శోభితకు కుడివైపున ఉన్నాడు. ఆమె మామ..నాగార్జున ఎడమవైపున ఉన్నారు.

ఈ నేపథ్యంలో శోభిత బొట్టుపెట్టుకుందామని తల కిందకు వంచగానే.. ఆమె వెంట్రుకలు ముందుకు జారీనట్లు తెలుస్తొంది. అప్పుడు.. నాగార్జున ఆమె వెంట్రుకల్ని పట్టుకుని బొట్టుపెట్టుకునేటప్పుడు ఇబ్బంది కల్గకుండా పట్టుకున్నారు.అయితే.. కొంత మంది నెటిజన్లు మాత్రం.. ఇదిఅవసరామా..అంటూ ట్రోల్స్ చేస్తున్నారంట.

Read more: Sobhita and Nagachaitanya: బుట్టలో కూర్చున్న శోభిత.. నెట్టింట ట్రెండింగ్‌గా మారిన చైతు, శోభితల పెళ్లి ఫోటోలు..

ఆమె చిన్న పిల్ల కాదు.. అది కూడా కొత్త కోడలు.. ఇలా చేస్తే లేని పోనీ ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారంఇచ్చినట్లు కాదా.. అని కొందరు ట్రోల్స్ చేస్తున్నారం. మరికొందరు అక్కినేని అభిమానులు మాత్రం.. కోడలు అంటే.. కూతురుతో సమానం. కాబట్టి కింగ్ నాగార్జున అదే ప్రేమ, ఆప్యాయతతో అలా చేసుంటారు.. అంత మాత్రానికి ఏదో బూతులాగా చూడటం ఎందుకని కౌంటర్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వివాదం మాత్రం నెట్టింట వైరల్ గా మారిందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News