Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లతో అదరగొడుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2024, 09:40 AM IST
Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు

Pushpa 2: పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా విడుదలై బన్నీ అభిమానులకు పండుగ వాతావరణం కల్గిస్తోంది. పుష్ప మొదటి భాగం విడుదలైన మూడేళ్ల సుదీర్ఘ కాలం తరువాత రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్టే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు ఆ సంస్థ చేజిక్కించుకుంది. 

పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో, ఇవాళ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో బన్నీ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు పుష్ప 2 సందడే హల్‌చల్ చేస్తోంది. జాతర..ఊర మాస్ జాతర అని చెబుతున్నారు. అంచనాలకు తగ్గట్టే ఎలివేషన్స్ భారీగా ఉన్నాయి. సుకుమార్ మార్క్ దర్శకత్వం స్పష్టంగా కన్పిస్తోంది. సంగీతంలో దేవిశ్రీప్రసాద్ మరోసారి అదరగొట్టాడు. అల్లు అర్జున్ నటన పీక్స్‌కు చేరిందంటున్నారు. కచ్చితంగా రికార్డు స్థాయి కలెక్షన్లు సృష్టిస్తుందనే అంచనా ఉంది. 

థియేటర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడిక ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చర్చ మొదలైంది. ఇంతటి సూపర్ డూపర్ హిట్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఏకంగా 250 కోట్లకు సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు విన్పిస్తోంది. పుష్ప మొదటి భాగం మూడేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాగా ఇప్పుడు పుష్ప 2 మాత్రం నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. 
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడనేది ఇంకా తెలియదు. 

Also read: Mega vs Allu: మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు.. పుష్ప సినిమాతో బట్టబయలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News